ETV Bharat / international

'మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించండి'

భారత్​ తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. మతపరమైన మైనారిటీల హక్కులను.. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది.

US urges India to protect rights of religious minorities
భారత్​ మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించండి: అమెరికా
author img

By

Published : Dec 13, 2019, 9:45 AM IST

భారత్​.. తన రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని భారత్​ తీసుకువచ్చిన నేపథ్యంలో అగ్రదేశం కీలక ప్రకటన చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో క్యాబ్​కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.

"పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించిన పరిణామాలను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. మత స్వేచ్ఛకు గౌరవం ఇచ్చి, అన్ని మతాలను సమానంగా గౌరవించడం.. మన రెండు ప్రజాస్వామ్య దేశాల ప్రాథమిక సూత్రాలు. భారతదేశం.. తన రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించాలని అమెరికా విజ్ఞప్తి చేస్తోంది."- అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్​ నుంచి వచ్చే ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించినదే పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్​). దీనిపై వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఈశాన్య భారతంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. దీని వల్ల తమ అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుందని ఈశాన్య రాష్ట్ర ప్రజలు భావిస్తుండడమే ఇందుకు కారణం. ఈ బిల్లును రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ గురువారం రాత్రి ఆమోదించారు.

ఇదీ చూడండి: రష్యాతో ఒప్పందం రద్దు తర్వాత అమెరికా కీలక పరీక్షలు

New Delhi, Dec 13 (ANI): HRD Minister R Pokhriyal reacted on Central Sanskrit Universities Bill, which was introduced in LS and stated that the bill will help the students to pursue higher studies in Sanskrit language. "Under this bill, 3 deemed Sanskrit universities have been made central universities. These universities will help students pursue higher studies in Sanskrit language," said HRD Minister.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.