ETV Bharat / international

అమెరికా, చైనా మధ్య మరో వివాదం- ట్రేడ్​ డీల్ దారెటు? - చైనా మానవహక్కుల ఉల్లంఘనపై అమెరికా గరంగరం

ఉయ్ఘర్​ మైనారిటీ ప్రజల అణచివేత, మానవహక్కుల ఉల్లంఘన వ్యవహారంలో చైనాను అడ్డుకునేందుకు అమెరికా కాంగ్రెస్​ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఓ చట్టాన్ని రూపొందించే పనిలో ఉంది. కేవలం వాణిజ్య ఒప్పందం విషయంలో మాత్రమే చైనాతో కఠిన వ్యవహరిస్తున్న ట్రంప్​కు.. ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

US likely to hit China over human rights despite trade talks
అమెరికా, చైనా మధ్య మరో వివాదం- ట్రేడ్​ డీల్ దారెటు
author img

By

Published : Dec 6, 2019, 11:19 AM IST

Updated : Dec 6, 2019, 3:31 PM IST

అమెరికా, చైనా మధ్య మరో వివాదం- ట్రేడ్​ డీల్ దారెటు?

అగ్రదేశం అమెరికా ఓ వైపు చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే.. మరోవైపు డ్రాగన్ మానవహక్కుల ఉల్లంఘనలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ఇది అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు ఇబ్బందికరంగా మారింది.

చైనాను అడ్డుకునేందుకు..

వాయవ్య ప్రాంతంలోని ఉయ్ఘర్​ మైనారిటీ ప్రజలను చైనా క్రూరంగా అణచివేస్తోందని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మానవ హక్కుల ఉల్లంఘనను అడ్డుకునేందుకు చైనా అధికారులపై ఆంక్షలు, ఇతర చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే ఓ చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది అమెరికా కాంగ్రెస్​. ఇప్పటికే సంబంధిత బిల్లును దిగువ సభ 407-1 ఓట్ల తేడాతో ఆమోదించింది. రానున్న 2 వారాల్లో ఈ బిల్లును ఎగువసభ ఆమోదించే అవకాశముంది. తర్వాత ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేస్తే చట్టంగా మారుతుంది.

ట్రంప్​కు మరో మార్గం లేదు!

చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తోంది డొనాల్డ్ ట్రంప్ సర్కారు. ఈ అంశంపై చర్చలు జరుగుతుండగానే ఇటీవల హాంకాంగ్​ వ్యవహారంపై అమెరికా కాంగ్రెస్​ బిల్లును ఆమోదించడం, దానిపై ట్రంప్​ సంతకం చేయాల్సి రావడం... అధికార పక్షానికి కాస్త ఇబ్బందిగా మారింది. వాషింగ్టన్​, బీజింగ్​లోని పాలక వర్గాల మధ్య దూరం పెరిగేందుకు కారణమైంది. ఇప్పుడు అదే తరహాలో చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా మరో చట్టం చేసేందుకు సిద్ధమవడం... ట్రంప్​కు తలనొప్పిగా మారింది. ఈ సవాళ్లను అధిగమించి, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆయన ఏ మేరకు సఫలమవుతారన్నది చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి: ట్రంప్​ మాటలతో మళ్లీ ఆశలు- మార్కెట్లకు లాభాలు

AP Video Delivery Log - 0300 GMT News
Friday, 6 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0257: US MN Helicopter Crash 2 Must Credit KSTP; No access Minneapolis-St. Paul; No use by US broadcast networks; No re-sale, re-use or archive 4243372
Governor: 3 dead in military helicopter crash
AP-APTN-0203: US UT Huntsman Russia AP Clients Only 4243370
Former U.S. envoy warns on Putin, Russia tactics
AP-APTN-0155: Hong Kong Indonesian Journalist AP Clients Only 4243369
Indonesia journalist blinded in HK seeks answers
AP-APTN-0135: Chile Clashes AP Clients Only 4243368
Fewer protesters but Chile clashes continue
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 6, 2019, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.