ETV Bharat / international

'లష్కరే, జైషే ఉగ్ర సంస్థల వల్ల భారత్​కు ముప్పు' - 'లష్కరే, జైషే ఉగ్ర సంస్థల వల్ల భారత్​కు పొంచి ఉన్న ముప్పు'

పాక్​ ఆధారిత లష్కరే, జైషే సంస్థల వల్ల భారత్​కు ప్రమాదం పొంచి ఉందని​ అమెరికా తెలిపింది. ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న వారిని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాక్ అనుమతిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

'లష్కరే, జైషే ఉగ్ర సంస్థల వల్ల భారత్​కు పొంచి ఉన్న ముప్పు'
author img

By

Published : Nov 3, 2019, 5:54 PM IST

Updated : Nov 3, 2019, 7:25 PM IST

'లష్కరే, జైషే ఉగ్ర సంస్థల వల్ల భారత్​కు ముప్పు'

పాకిస్థాన్​ ఆధారిత లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థల వల్ల భారత్​కు​ ప్రమాదం పొంచి ఉందని అమెరికా హెచ్చరించింది. ​లష్కరే తోయిబాతో సంబంధాలున్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిచ్చిన పాక్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

'కంట్రీ రిపోర్ట్స్​ ఆన్​​ టెర్రరిజమ్​-2018' పేరిట ఇటీవలే ఓ నివేదికను విడుదల చేసింది అమెరికా. ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) ప్రణాళికను అమలు చేయటంలో పాక్​ అధికారులు విఫలమయ్యారని మండిపడింది. ఐరాస ఆంక్షలు విధించినప్పటికీ.. లష్కరే తోయిబా సహా ఇతర ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్​ నుంచి ఆర్థిక సహాయం అందుతూనే ఉందని స్పష్టం చేసింది.

భారత్​ లక్ష్యంగా 2008 ముంబయి దాడులు, 2018 ఫిబ్రవరిలో కశ్మీర్​ సుంజువాన్​ ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరాలపై దాడులకు కారణం పాక్​కు​ చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్​ సంస్థలేనని నివేదికలో పేర్కొంది అమెరికా.

ఆఫ్గానిస్థాన్​ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే ఉగ్రవాదులను పాకిస్థాన్​ పెంచి పోషిస్తోందని నివేదికలో తెలిపింది. తీవ్రవాదుల ద్వారా అమెరికా- ఆఫ్గాన్​ సైనికులను బెదిరించే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ఉగ్రవాద ఆర్థిక కార్యకలపాలను నియంత్రించటంలో విఫలమై.. ప్రపంచ దేశాల విశ్వాసాన్ని పాకిస్థాన్​ కోల్పోయిందని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:ఉద్యోగం వీడాడు.. ప్లాస్టిక్​కు వ్యతిరేకంగా సైకిల్​ పట్టాడు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 3, 2019, 7:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.