ఆత్మాహుతి దాడిలో ఛిద్రమైన కరడుగట్టిన ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధిపతి అబు బకర్ అల్ బాగ్దాదీ అవశేషాలను సముద్రంలో గుర్తు తెలియని చోట పడవేసినట్లు అమెరికా సైనిక అధికారులు వెల్లడించారు. 2011లో లాడెన్ మృతదేహాన్ని కూడా సముద్రంలోనే వేశారు.
సిరియా ఇడ్లిబ్ రాష్ట్రంలోని బరీష్ గ్రామంలో బాగ్దాదీ ఉన్నట్లు తెలుసుకుని గతవారం అమెరికా బలగాలు అతడి స్థావరంపై దాడి చేశాయి. విధిలేక ఓ సొరంగంలో ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు బాగ్దాదీ. మృతదేహానికి అమెరికా సైనిక అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేయించారు. బాగ్దాదీ హతంపై గతంలో అనేకసార్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అతడి మరణాన్ని ధ్రువీకరించేందుకు ఈ పని చేశారు.
కీలక పాత్ర పోషించిన శునకం...
అల్ బాగ్దాద్ చివరి క్షణాల వరకు అమెరికా సైన్యానికి చెందిన ఓ శునకం తరిమి తరిమి వెంటాడింది. సొరంగం చివరకు వెళ్లిన అతడిపై జాగిలం దాడి చేసింది. అతడు చివరికి ఆత్మాహుతి చేసుకునే వరకు వెంటాడింది. ఈ వేటలో ఆ శునకానికి స్వల్పగాయాలయ్యాయి. చికిత్స అనంతరం తిరిగి విధుల్లో చేరింది ఆ శునకం.
ఇదీ చూడండి:తల్లిదండ్రులు టీవీలో బిజీ- తొట్టిలో పడి చిన్నారి మృతి