ETV Bharat / international

మానవుల్లో నృత్య నైపుణ్యం చింపాంజీల నుంచే.!

author img

By

Published : Dec 28, 2019, 11:50 AM IST

మానవున్ని పోలిన జీవి అంటే టక్కున గుర్తొచ్చేది చింపాంజీ. అయితే మానవుల్లో నృత్య నైపుణ్యం చింపాంజీల నుంచే ఉద్భవించి ఉంటుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అమెరికాలోని ఓ జూలో రెండు చింపాంజీలు సంగీతానికి తగ్గట్టుగా మనుషుల్లాగే సమన్వయంతో స్టెప్పులేయడం చూసి ఆశ్చర్యపోయారు.

Human dancing skills may have evolved from chimpanzees
మానవుల్లో నృత్య నైపుణ్యం చింపాంజీల నుంచే.!

అమెరికా జంతుప్రదర్శనశాలలో రెండు చింపాంజీలు అచ్చం మానవుల్లాగే నృత్యం చేయడాన్ని గమనించారు శాస్త్రజ్ఞులు. వీటిలో ఇప్పటిదాకా ఎన్నడూ చూడని ఈ ప్రవర్తన చూసి మానవుల్లో నృత్య నైపుణ్యం ఎలా ఉద్భవించిందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది.

యూకే వార్విక్​ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు రెండు ఆడ చింపాంజీలు నృత్యం చేయడాన్ని పరిశీలించారు. రెండూ సమన్వయంతో సంగీతానికి అనుగుణంగా కాళ్లు కదుపుతూ స్టెప్పులేయడాన్ని గమనించారు. ఆర్కెస్ట్రా ప్లేయర్ల సంగీతానికి సరిపోలేలా చింపాజీలు నృత్యం చేశాయి. అయితే ఇప్పటి వరకు మనుషులు తప్ప మరే ఇతర జీవులు సమన్వయంతో సంగీతానికి తగ్గట్టుగా నృత్యం చేసిన సందర్భాలు లేవు. తొలిసారి ఈ లక్షణాన్ని రెండు ఆడ చింపాంజీల్లో గమనించారు పరిశోధకులు. ఇది వాటికున్న గొప్ప లక్షణమని పేర్కొన్నారు. బహుశా మానవుల్లో నృత్య నైపుణ్యం వీటి నుంచే ఉద్భవించి ఉంటుందని భావిస్తున్నారు.

"నృత్యం...మానవ వ్యక్తీకరణకు చిహ్నం. ప్రపంచంలో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు జంతువుల వ్యవస్థల అద్భుతమైన సమృద్ధిని గుర్తు చేస్తున్నా... మనుషుల్లో నృత్య నైపుణ్యం ఎలా వచ్చిందనే విషయం మాత్రం అస్పష్టంగా ఉంది."

-ఆండ్రియానో లామైరా, వార్విక్​ విశ్వవిద్యాలయం పరిశోధకురాలు

ఇద్దరు కలిసి నృత్యం చేసేటప్పడు ఒకరి స్టెప్పులకు మరొకరు సరిపోలేలా శరీరాన్ని ఒకేసారి కదిలించాల్సి ఉంటుంది. అందుకే మానవేతర జీవుల్లో ఈ నైపుణ్యం ఉండటం కష్టమని లామైరా చెప్పారు. మౌలికదశలో లేని మానవుని నృత్య ప్రదర్శనలను పునర్నిర్మించుకోవడానికి ఈ చింపాంజీల నృత్యం సాయపడుతుందని లామైరా అన్నారు.

ఇదీ చూడండి: మరణశిక్ష తీర్పును సవాలు చేసిన ముషారఫ్​

Mumbai, Dec 27 (ANI): Bollywood superstar Salman Khan turned 54 on December 27. He cut the cake with mediapersons in Mumbai. Salman wore black t-shirt and blue jeans at the event. While interacting with the media, he said talked about 'Dabangg 3' opening and said that he salute fans that they are going to watch the film even after the continuous CAA protests going across the country.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.