అగ్రరాజ్య నౌకదళాన్ని హాంకాంగ్‌కు రాకుండా అడ్డుకుంటామని డ్రాగన్ దేశం చైనా ప్రకటించింది. ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులకు మద్దతుగా అమెరికా ఇటీవల రెండు చట్టాలను ఆమోదించింది. దీనికి సమాధానంగానే నౌకలను అడ్డుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది డ్రాగన్. అమెరికా ఆమోదించిన చట్టం ఎలాంటి పరిణామాలు సృష్టిస్తుందో ఇప్పటివరకు తెలియదని, అయితే వాటి మూల్యం అగ్రరాజ్యమే ఎదుర్కోవాలని హెచ్చరించింది.
ఈ చట్టాన్నిను వెనక్కి తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుందని వ్యాఖ్యానించింది.
"అమెరికా వైఖరికి జవాబుగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. హాంకాంగ్ మానవ హక్కులు, ప్రజాస్వామ్య చట్టం మా అంతర్గత విషయం."
-హువా చునింగ్, మంత్రిత్వ శాఖ ప్రతినిధి
హాంకాంగ్‌లో మానవహక్కులు, ప్రజాస్వామ్య చట్టం-2019కి గత వారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదముద్ర వేశారు.
ఇదీ చూడండి : మోదీ బంపర్ ఆఫర్.. శరద్ పవార్ నో..!