దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌ను సందర్శించేందుకు ఇక నుంచి వీసా అవసరం ఉండకపోవచ్చు.
ఆ దేశంలో పర్యటించే భారతీయ, చైనా పర్యాటకులు, వ్యాపారస్థులకు వీసా అనుమతుల నుంచి మినహాయింపునిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో గురువారం ప్రకటించారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయన అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.
అభివృద్ధి చెందిన దేశాల పర్యాటకులు, వ్యాపారస్థులు బ్రెజిల్‌ను సందర్శించేందుకు వీసా అవసరాల్ని కుదించడమే తన విధానమని ప్రకటించారు. అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల నుంచి వచ్చేవారికి వీసా అనుమతుల్ని రద్దు చేశారు. తాజాగా ఈ విధానాన్ని భారత్, చైనా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
ఇదీ చూడండి:పడిలేచిన 'మహా' కెరటం పవార్!