ETV Bharat / city

రహదారి కాదది... మృత్యుదారి...! - Nizamabad to Bansvada route

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రహదారులు.. మృత్యుదారులుగా మారాయి. అడుగడుగునా గుంతలు, ఎక్కడికక్కడ తెగిపోయి, కంకర రాళ్లు తేలాయి. పాలకుల పాపం ప్రయాణికులకు శాపంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా.. కొత్త రోడ్డు పేరుతో ఉన్న రోడ్డు బాగు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వారానికో ప్రమాదం.. నెలరోజులకొకరు చనిపోతున్నారు.

రహదారి కాదది... మృత్యుదారి...!
author img

By

Published : Oct 25, 2019, 4:41 PM IST

రహదారి కాదది... మృత్యుదారి...!

నిజామాబాద్ - బాన్సువాడ రహదారిలో ప్రయాణం టెర్రర్​ పుట్టిస్తోంది. గుంతలు, తెగిపోయిన రోడ్డుతో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణమంటేనే ఒళ్లు గుల్లవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభాపతి సొంత జిల్లాలో రహదారుల దుస్థితి ఇలా ఉంటే ఎలా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

జిల్లా రహదారులు.. నరకానికి "దారులు"
కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లేందుకు బాన్సువాడ మార్గమే కీలకం. మద్నూర్ మీదుగా మహారాష్ట్రకు, బాన్సువాడ నుంచి జుక్కల్ మీదుగా కర్ణాటకకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. బస్సులు, లారీలు, వ్యక్తిగత వాహనాలపై ప్రజలు అధికంగా ప్రయాణిస్తుంటారు. అత్యవసర కేసులు, గర్భిణీలు ఈరోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలామంది మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. నిజామాబాద్ నుంచి బాన్సువాడకు ప్రయాణ మంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. గతుకులు, గుంతలు, తెగిపోయిన రోడ్డుతో ప్రయాణం నరకప్రాయంగా మారింది.

ప్రయాణం.. నరకప్రాయం...
నిజామాబాద్ నుంచి బాన్సువాడకు మొత్తం 50కి.మీ.ల దూరం ఉంటుంది. ఇందులో దాదాపు 40కి.మీ.ల మేర రోడ్డు ధ్వంసమైంది. నిజామాబాద్ నుంచి వర్ని వరకు 25 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరంగా మారింది. నాగారం, మల్లారం, మోస్రా, చందూర్, శ్రీనగర్ ప్రాంతాల్లో పెద్దపెద్ద గుంతలు, కంకర తేలిన రోడ్డు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

కొత్త రోడ్డు వేయరు.. ఉన్న రోడ్డు బాగు చేయరు..!
రహదారి నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినప్పటికీ ఫలితం ఉండడం లేదు. నిజామాబాద్ నుంచి బాన్సువాడకు నాలుగు వరుసల కొత్త రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదన నిర్మాణ రూపం దాల్చకపోవడం వల్ల కొత్తరోడ్డు వేయక, ఉన్న రోడ్డును బాగు చేయకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు మరమ్మతులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డిపై డ్రైవర్​ ఫిర్యాదు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.