నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నిక... బోధన్ పట్టణంలో సాఫీగా సాగింది. జిల్లాకు పూర్వ వైభవం వస్తుందని, కవితక్క త్వరలోనే మంత్రి కాబోతున్నారని... ఎమ్మెల్యే షకీల్ కొనియాడారు.
బోధన్ మండలానికి సంబంధించి 56 మంది... అందులో 17 ఎంపీటీసీలు, 37 మంది కౌన్సిలర్లు, ఓ జెడ్పీటీసీ, ఎక్స్ అఫిషియో హోదాలో ఎమ్మెల్యే షకీల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాజీ ఎంపీ కవితక్క లేని లోటు... నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలిసిందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే మంత్రి అవుతారని ఆయన సంభోదించారు.
ఇదీ చూడండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస గెలుపు తథ్యం: కేటీఆర్