ETV Bharat / city

కన్నపేగు రాసిన మరణశాసనమిది... రజిత హత్యకేసులో కీర్తి, శశి అరెస్ట్ - hyderabad latest news

హయత్‌నగర్‌లో సంచలనం సృష్టించిన రజిత హత్య కేసులో నిందితులు కీర్తి, ఆమె ప్రియుడు శశికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19న రజితను కీర్తితో కలిసి శశికుమార్ హత్య చేశారని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌ భగవత్ వెల్లడించారు.

"దృశ్యం సినిమాను తలపించేలా..."
author img

By

Published : Oct 31, 2019, 6:01 PM IST

Updated : Oct 31, 2019, 8:25 PM IST

"దృశ్యం సినిమాను తలపించేలా..."

హైదరాబాద్‌ హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మునగనూరులో రజిత హత్యకేసును పోలీసులు ఛేదించారు. పధకం ప్రకారమే ఈనెల 19న ఆమెను హత్య చేశారని.. నిందితులు కీర్తి, శశికుమార్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. మృతురాలి వడ్డీ వ్యాపారంపై కన్నేసిన శశికుమార్... కీర్తిని బ్లాక్​మెయిల్​ చేసి లొంగదీసుకున్నాడని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

నిందితులు కీర్తి, శశికుమార్
నిందితులు కీర్తి, శశికుమార్

"కీర్తి ఇంటి సమీపంలో ఉండే బాల్‌రెడ్డి(23).. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భవతి అయిన కీర్తిని శశికుమార్‌ లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు కీర్తి తల్లి రజిత అడ్డు చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన కీర్తి, ఆమె ప్రియుడు శశికుమార్‌ కలిసి పధకం ప్రకారం తల్లి రజితను గొంతు నులిమి చంపేశారు. మూడు రోజుల తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి రామన్నపేట వద్ద రైలు పట్టాలపై పడేశారు. గతంలో కూడా తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి చంపేందుకు కీర్తి ప్రయత్నించింది. కీర్తిపై అత్యాచారానికి పాల్పడిన బాల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లలో చాలా ఆధారాలున్నాయని సీపీ తెలిపారు. నేరం తమపైకి రాకుండా ఉండేందుకు కీర్తి, శశికుమార్‌ చాలా ప్రయత్నాలు చేశారని చెప్పారు. హత్య చేశాక కీర్తి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తల్లి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసిందని, ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరిపి నిందితులను అరెస్ట్‌ చేశామని సీపీ వివరించారు. కీర్తి, శశికుమార్​ కలిసి రజితను హత్యచేయడం.. తల్లి కనిపించట్లేదని ఫిర్యాదు చేయడంలాంటి ఉదంతాలన్ని దృశ్యం సినిమా రెండో పార్ట్‌లా ఉన్నాయని మహేశ్ భగవత్ గుర్తు చేశారు.

ఇవీ చూడండి: ఆమెను చంపితేనే "సుఖం"..!

TG_Hyd_54_31_CP_On_Rajitha_Murder_Case_PC_AB_3181326_TS10015 Reporter: Srikanth Contributor:Sathish Script: Razaq Note: ఫీడ్ DSNG ద్వారా వచ్చింది. ( ) హయత్‌నగర్‌లో సంచలనం సృష్టించిన రజిత హత్య కేసులో మృతురాలు కూతురు కీర్తి ఆమె ప్రియుడు శశికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19న రజితను కీర్తితో కలిసి శశికుమార్ హత్య చేశారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ మహేశ్‌ భగవత్ వెల్లడించారు. మృతురాలు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తుండడంతో డబ్బులపై కన్నెసిన శశికుమార్ అమెను హత్యచేసి 10లక్షలు తీసుకుందామని కీర్తిని ప్రేరేపించాడని సీపీ తెలిపారు.లేదంటే కీర్తితో చనువుగా ఉన్నప్పటి ఫోటోలు అమె మాజీ ప్రియుడితోపాటు తల్లికి చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడని పేర్కొన్నారు. మొదట కీర్తి బాల్‌రెడ్డి అనే యువకుడితో ప్రేయాణం నడిపించగా.....బాల్‌రెడ్డితో ఇరువురు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో అమె గర్భం దాల్చగా..గర్భస్రావం చేయించుకునే క్రమంలో కీర్తికి శశికుమార్త తో పరిచయం ఏర్పడింది. కీర్తిని భయపెట్టి లొంగదీసుకుని... ఈ క్రమంలో తనతో కలిసి సన్నిహితంగా ఉన్న ఫోటోలను శశి తీసుకున్నాడని సీపీ వివరించారు. శశి బ్లాక్ మెయిల్‌తో వీరిద్దరు కలిసి రజితను హత్య చేశారన్నారు. కీర్తి తల్లిపై కూర్చుని మెడకు చున్ని బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపివేశారన్నారు. హత్య అనంతరం 21న మృతదేహాన్ని కేర్‌లో తీసుకెళ్లి రామంపేట్ రైల్ వే ట్రాక్ పక్కన పడేశారన్నారు. అనంతరం ఈ నెల 26వ తేదీన తన తల్లి కనిపించడంలేదని హయత్‌ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని సీపీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తులో అసలు నిజాన్ని బయటకు తెచ్చామని మహేశ్ భగవత్ వివరించారు. ఈ ఉదంతమంతా దృశ్యం సినిమా రెండో పార్ట్‌లాగా ఉందన్నారు. బైట్: మహేశ్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్
Last Updated : Oct 31, 2019, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.