ETV Bharat / city

మత్తులోకి దించి.. మట్టుబెడతాడు - Telangana latest Crime

అతడో నరరూప రాక్షసుడు. కల్లు, మద్యం తాగే మహిళలే లక్ష్యం. ఇప్పటి వరకు ఏకంగా 16 మందిని మట్టుపెట్టాడు. బంగారం, సొమ్ముల కోసమే ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు. జైలుకు వెళ్లివచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. సొంత తమ్ముడిని కూడా అంతమొందించాడు. ఇటీవల ఓ మహిళను హత్య చేసిన కేసులో పోలీసులకు చిక్కాడు.

మత్తులోకి దించి.. మట్టుబెడతాడు
మత్తులోకి దించి.. మట్టుబెడతాడు
author img

By

Published : Dec 28, 2019, 6:46 AM IST

Updated : Dec 28, 2019, 7:45 AM IST

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు శివారులో అలివేలమ్మ అనే మహిళ ఈ నెల 16న హత్యకు గురైంది. బాలనగర్ మండలం గుండేడ్‌కు చెందిన ఎరుకల శ్రీను ఈ హత్యచేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడితోపాటు హత్యతో సంబంధమున్న అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గతంలో ఇదే కోణంలో చాలా హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

16 మందిని

బూత్పూర్ మండలం కరివెన శివారులో బాలమ్మ అనే మహిళ, కొత్తకోట మండలం అప్పరాలలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో టీఎస్​ఎండీసీ ఇసుక యార్డులో ఓ మహిళ ఎముకల గూడు దర్శనమిచ్చింది. ఈ ఇసుక కుప్పను మహబూబ్‌నగర్ జిల్లా నుంచి తీసుకొచ్చి డంప్ చేసినట్లుగా తేలింది. చివరకు దేవరకద్ర మండలం డోకూరులో జరిగిన మహిళ హత్య కేసు నిందితుడే ఈ నాలుగు హత్యలూ చేసినట్లు తేలింది.

మత్తులోకి దించి.. మట్టుబెడతాడు

శ్రీను - నేర సామ్రాజ్యం

  1. సొంత తమ్ముడు, అత్త సహా 13 హత్య కేసుల్లో ఎరుకల శ్రీను నిందితుడుగా ఉన్నాడు. మూడు కేసులు రుజువు కాగా మిగిలిన కేసులు దర్యాప్తులో ఉన్నాయి.
  2. గతంలో మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఏడు హత్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
  3. షాద్‌నగర్, శంషాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
  4. 2007లో తమ్ముడి హత్యకేసులో ఎరుకలి శ్రీను జైలుకెళ్లాడు. సత్ప్రవర్తన కింద అప్పీలు చేసుకొని శిక్షకాలానికి ముందే జైలు నుంచి బయటకు వచ్చాడు. బయటకి రాగానే మళ్లీ నేరాలు మొదలు పెట్టాడు.
  5. తాజాగా జరిగిన హత్యకేసుల్లో అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
  6. మహిళల ఒంటిమీదున్న నగలే లక్ష్యంగా ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

మద్యం దుకాణాల్లో సీసీ నిఘా

అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. అనుమానం వస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరహా నేరాలు జరుగుతున్న నేపథ్యంలో కల్లు, మద్యం దుకాణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యల్లో ఎరుకల శ్రీనుతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

"తాజాగా శ్రీనుని పోలీసులు అరెస్ట్‌ చేసే సమయంలో పై అధికారులతో నిందితుడు వాదనకు దిగినట్లు తెలుస్తోంది. గతం మర్చిపోయి... ఇప్పుడు సత్ప్రవర్తనతో మెలుగుతున్నానని అయినా పోలీసులు నన్ను వదిలిపెట్టడంలేదంటూ శ్రీను వాదనకు దిగినట్లు సమాచారం"

ఇవీ చూడండి: మహిళలను హత్యచేసి దోచుకునే దొంగ దొరికాడు

File : TG_Hyd_13_28_Muncipolls_Pkg_3053262 From : Raghu vardhan ( ) పురపోరు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఎన్నికలు సజావుగా సాగేందుకు వీలుగా పరిశీలకులను నియమించిన ఎస్ఈసీ... అభ్యర్థుల ఖర్చు కోసం కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఒక్కో జిల్లాకు ఐఏఎస్ అధికారిని పరిశీలకులుగా, మరో అధికారిని వ్యయ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది...లుక్ వాయిస్ ఓవర్ - పురపాలక ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ఒక్కో జిల్లాకు ఒక్కో ఐఏఎస్ అధికారిని పరిశీలకులుగా నియమించింది. తక్కువ మున్సిపాల్టీలు ఉన్న చోట మాత్రం పరిశీలకులకు మరో జిల్లా బాధ్యతలు కూడా అప్పగించింది. 31 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతుండగా 27 మంది ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. శ్రుతి ఓజా, విజయేంద్ర, అబ్దుల్ అజీఎం, అద్వైత్ కుమార్ సింగ్, హరిచందన, నిర్మల, పమేలా సత్పతి, పౌసుమి బసు, అలుగు వర్షిణి, కె.వై.నాయక్, చంపాలాల్, సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారుఖీ, ప్రావీణ్య తదితరులను ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. అటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిశీలనకు కూడా ప్రత్యేకంగా పరిశీలకులను నియమించారు. జిల్లా ఆడిట్, సహాయ ఆడిట్ అధికారులను ఒక్కో జిల్లాకు ఒకరిని వ్యయ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు. అటు పురపాలక ఎన్నికల్లో అనర్హుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2014 పురపాలక ఎన్నికల్లో పోటీచేసి ఖర్చులకు లెక్కలు చెప్పని వారిపై అనర్హతా వేటు వేసింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన రూపంలో అందించాలి. లేదంటే వారిపై మూడేళ్లపాటు అనర్హతా వేటు వేస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో అనర్హుల సంఖ్య 1906. అత్యధికంగా రామగుండంలో 363 మంది ఉన్నారు. కరీంనగర్ లో 132, ఆదిలాబాద్ లో 113 మంది అనర్హత వేటు పడిన వారిలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.
Last Updated : Dec 28, 2019, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.