ETV Bharat / city

మున్సిపల్​ ఎన్నికల పరిశీలకులను నియమించిన ఉత్తమ్​

మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్​ పార్టీ సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు, నగరపాలక సంస్థలకు టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ పరిశీలకులను నియమించారు.

మున్సిపల్​ ఎన్నికల పరిశీలకులను నియమించిన ఉత్తమ్​
మున్సిపల్​ ఎన్నికల పరిశీలకులను నియమించిన ఉత్తమ్​
author img

By

Published : Jan 2, 2020, 8:45 PM IST

రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 95 మునిసిపాలిటీలకు, 10 నగరపాలక సంస్థలకు పీసీసీ పరిశీలకులను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నియమించారు. 5,6 తేదీలలో మునిసిపాలిటీల పరిధిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని ఇంఛార్జిలకు ఉత్తమ్‌ సూచించారు.

నగరపాలక సంస్థల పరిశీలకులు వీరే..

  1. కరీంనగర్‌ -ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
  2. రామగుండం- ఎం.అంజన్‌, ఆమర్‌ యాదవ్‌
  3. బడంగపేట- వి.హనుమంతురావు
  4. మీర్‌పేట- కోదండరెడ్డి
  5. బండ్లగూడ జాగిర్‌- రాములు నాయక్‌
  6. బోడుప్పల్‌- మాజీ మంత్రి గీతా రెడ్డి
  7. పీర్జాదిగూడ- మర్రి శశిధర్‌రెడ్డి
  8. జవహర్‌నగర్‌- ఎం.ఎ.ఖాన్‌
  9. నిజాంపేట- పొన్నాల లక్ష్మయ్య
  10. నిజామాబాద్‌- నగరపాలక సంస్థ దామోదర రాజనర్సింహ

ఈ పీసీసీ పరిశీలకులు ఆయా కార్పొరేషన్ల పరిధిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు సూచించారు. వీరితో పాటు జిల్లాల వారీగా పీసీసీ సమన్వయ కర్తలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమించారు. ఈ నెల 4వ తేదీన జిల్లా కేంద్రాలలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని వారికి సూచించారు.

TG_HYD_82_02_MUNCIPAL_ELECTIONS_PCC_OBSERVERS_AV_3038066 Reporter: M.Tirupal Reddy Dry ()రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు సాధించుకోడానికి కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 95 మునిసిపాలిటీలకు, 10 నగరపాలక సంస్థలకు పీసీసీ పరిశీలకులను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నియమించారు. అయిదారు తేదీలలో మునిసిపాలిటీల పరిధిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని ఇంఛార్జిలకు ఉత్తమ్‌ సూచించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఇంఛార్జిగా ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిని, రామగుండం నగరపాలక సంస్థకు ఎం.అంజన్‌కుఆమర్‌ యాదవ్‌, బడంగపేట నగరపాలక సంస్థకు వి.హనుమంతురావు, మీర్‌పేట నగరపాలక సంస్థకు కోదండరెడ్డి, బండ్లగూడ జాగిర్‌ నగర పాలక సంస్థకు రాములనాయక్‌, బోడుప్పల్‌ నగరపాలక సంస్థకు మాజీ మంత్రి గీతా రెడ్డి, పీర్జాదిగూడ నగరపాలక సంస్థ ఇంఛార్జిగా మర్రి శశిధర్‌రెడ్డి, జవహర్‌నగర్‌ నగరపాలక సంస్థ ఇంఛార్జిగా ఎం.ఎ.ఖాన్‌, నిజాంపేట నగరపాలక సంస్థ ఇంఛార్జిగా పొన్నాల లక్ష్మయ్య, నిజామాబాద్‌ నగరపాలక సంస్థ ఇంఛార్జిగా దామోదర్‌ రాజనర్సింహను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నియమించారు. ఈ పీసీసీ పరిశీలకులు ఆయా కార్పొరేషన్ల పరిధిలో ఈ నెల అయిదారు తేదీలలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు సూచించారు. ఇవి కాకుండా మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా పీసీసీ సమన్వయ కర్తలను నియమించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 4వ తేదీన జిల్లా కేంద్రాలలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.