ETV Bharat / city

థానేదర్‌ సింగ్​ కుష్వా... ఓ తెలివైన దొంగ..! - Hyderaba Crime news

ఆ యువకుడిది 15 ఏళ్ల ప్రస్థానం. 400 దొంగతనాలు. 2కోట్ల విలువైన సొత్తు చోరీలు. ఇది అతడి ట్రాక్‌ రికార్డ్‌..! చోరీకి అడ్డొస్తే పోలీసైనా సరే.. బ్లేడుతో దాడి చేసి పరారవుతాడు. ఎదురు తిరిగితే ప్రాణం తీస్తాడు. విలాసవంతమైన జీవితం కోసం ఎంతకైనా తెగిస్తాడు. 15 ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఓ కేటుగాణ్ని.. సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు పట్టుకున్నారు.

thanedar-singh-kushwa-at-o-clever-thief
థానేదర్‌ సింగ్​ కుష్వా@ ఓ తెలివైన దొంగ..!
author img

By

Published : Dec 25, 2019, 5:11 AM IST

Updated : Dec 25, 2019, 7:26 AM IST

థానేదర్‌ సింగ్​ కుష్వా@ ఓ తెలివైన దొంగ..!

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు థానేదర్‌ సింగ్​ కుష్వా.. కుటుంబ సమస్యలతో 2004లో ఉత్తర ప్రదేశ్‌ నుంచి పుణెకు మకాం మార్చాడు. రైల్వే ప్లాట్‌ ఫారంపై స్వీట్లు అమ్ముకుని జీవనం సాగించేవాడు. అతని ఎదుటే ప్రయాణికుల జేబులు కత్తిరిస్తూ జల్సాలు చేసే వారిని చూసి ఆకర్షితుడయ్యాడు. పెళ్లికి ముందే సంపన్నుడవ్వాలని కలలు కన్నాడు.. వక్ర మార్గంలో అక్రమంగా డబ్బు సంపాదిచడంపై మక్కువ పెంచుకున్నాడు.

వక్ర మార్గంలో.. అక్రమ సంపాదన...

2005లో దొంగతనాలు ప్రారంభించి.. కేవలం ఏడాది కాలంలోనే రూ.6 లక్షలు సంపాదించాడు. ఆ తర్వాత వికారాబాద్‌కు మకాం మార్చి చంద్రకాంత్‌ అనే జేబు దొంగతో కలిసి చోరీలు, బెట్టింగ్‌లు చేస్తూ భారీగా సంపాదించడం ప్రారంభించాడు.

కుష్వా - నేర ప్రస్థానం

  1. ఏటా పదుల సంఖ్యలో చోరీలు చేస్తూ... లక్షలు సంపాదిస్తూ తానేదర్‌ కుష్వా ఆస్తులు కూడబెట్టాడు. పలుమార్లు పోలీసులకు పట్టుబడి జైలుపాలైనా బుద్ధి మార్చుకోలేదు.
  2. 2014లో ఆగ్రా పోలీసులు జైలుకు పంపగా 2015లో విడుదలై.. హైదరాబాద్‌ కూకట్​పల్లికి మకాం మార్చాడు. ఇక్కడ రెండు నెలల్లోనే 45 లక్షలు చోరీ చేశాడు.
  3. హైదరాబాద్ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాడు. బెట్టింగ్‌లో నష్టాలు రావడంతో మళ్లీ చోరీల బాట పట్టాడు.
  4. నవంబర్‌లో బేగంపేట రైల్వే స్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. ప్రశ్నించిన పోలీసులపై దాడి చేసి పారిపోయాడు.
  5. అప్పటి నుంచి నిఘా వేసిన పోలీసులు...ప్రత్యేక బృందాల సాయంతో నిందితుడిని పట్టుకున్నారు.

400 దొంగతనాలు..రూ.2 కోట్లు సొత్తు చోరీ
థానేదర్‌ సింగ్ కుష్వా.. 2004 నుంచి ఇప్పటి వరకూ 400 దొంగతనాలతో 2 కోట్లు సొత్తు చోరీ చేశాడు. నిందితుడి నుంచి 13 లక్షల నగదు, 660 గ్రాముల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దొంగలున్నారు జాగ్రత్త..!

చోరీ సొమ్ముతో నిందితుడు హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా సమాచారం అందించాలని ప్రయాణికులకు సూచించారు.

ఇవీ చూడండి: కూతురి వరసయ్యే బాలికపై అత్యాచారయత్నం..

Intro:Body:Conclusion:
Last Updated : Dec 25, 2019, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.