తహసీల్దార్ విజయారెడ్డి హత్య దారుణమని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. అధికారుల భద్రతకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలతో కలెక్టర్లు మాట్లాడి వాళ్లకు భరోసానివ్వాలని అన్నారు. అధికారులు, ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేలా చూడాలని సోమేశ్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?