ఆర్టీసీలో 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పత్రాలను ముందుంచాలని అదనపు ఏజీని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పీఎల్ విశ్వశ్వర్ రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది.
ప్రజల అవసరాల దృష్ట్యా ప్రైవేట్ బస్సులకు మంత్రిమండలి అనుమతి ఇచ్చిందని... పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని అడ్వకేట్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. మంత్రి మండలి నిర్ణయాలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఏజీ వాదించగా... హైకోర్టు ఏకీభవించలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తీసుకునే నిర్ణయాలు రహస్యంగా ఉంచాల్సిన అవసరంలేదని.. ఒకవేళ అలా భావిస్తే సీల్డ్ కవర్లో సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'ధిక్కరణ చర్యలు చేపట్టే అధికారం మాకు ఉంది'