ETV Bharat / city

ఆర్టీసీ సంస్థకు కొత్త రూపు తెచ్చేందుకు సర్కారు సన్నాహాలు

ఆర్టీసీలో కొన్ని మార్గాల ప్రైవేటీకరణకు రంగం సిద్ధమవుతోంది. రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిర్ణయించిన విధంగా మూడు వేలకు పైగా మార్గాల్లో ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కేవలం ఆదాయాన్నిచ్చే మార్గాలే కాకుండా గ్రామీణ, సిటీ మార్గాలను కలిపి అనుమతులు ఇవ్వవచ్చని సమాచారం.

ఆర్టీసీ సంస్థకు కొత్త రూపు తెచ్చేందుకు సర్కారు సన్నాహాలు
author img

By

Published : Nov 1, 2019, 5:15 AM IST

Updated : Nov 1, 2019, 7:04 AM IST

ఆర్టీసీ సంస్థకు కొత్త రూపు తెచ్చేందుకు సర్కారు సన్నాహాలు

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానం రూపంలో సంస్థకు కొత్త రూపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సమ్మె ప్రారంభ సమయంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి... సగం బస్సులు యాజమాన్యానివే ఉంటాయని తెలిపారు. మిగతా సగం బస్సులు అద్దె వాటితో పాటు ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లు ఉంటాయని చెప్పారు. 30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లు ఉండాలన్నది సర్కార్ ఆలోచన. అందుకు అనుగుణంగా ఆర్టీసీ ఇం​ఛార్జీ ఎండీ, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ నేతృత్వంలోని కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వాటి ఆధారంగానే ఇప్పటికే అదనపు అద్దె బస్సుల కోసం ఆర్టీసీ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇప్పటికే 21 శాతం అద్దె బస్సులు

రెండు దఫాల్లో 1,250 అద్దె బస్సులకు నోటీసు ఇచ్చారు. ఇందుకు స్పందన కూడా బాగానే వచ్చింది. హైదరాబాద్​లోని కొన్ని మార్గాల్లో మాత్రం స్పందన అంతగా లేదు. ఆర్టీసీలో ఇప్పటికే 21 శాతం అద్దె బస్సులు ఉన్న నేపథ్యంలో మిగతా తొమ్మిది శాతం అద్దె బస్సులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 3,400 వరకు చేరనుంది. అటు సంస్థ సొంత బస్సులు 5,200 నడవనున్నాయి. ఆర్టీసీ సొంత బస్సులతో పాటు అద్దె బస్సులు కలిపి 80 శాతం పోను మిగతా 20శాతం ప్రైవేట్ బస్సులకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతి ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. అంటే 2,100 ప్రైవేట్ బస్సులకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతుల విషయమై రేపటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కీలక నిర్ణయాలకు అవకాశం

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ఆధారంగా ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతులు ఇవ్వవచ్చని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే రేపటి కేబినెట్​లో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం ఆదాయం వచ్చే మార్గాలను మాత్రమే ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అప్పగించకుండా... గ్రామీణ ప్రాంతాల మార్గాలతో పాటు హైదరాబాద్ సిటీలోని మార్గాలను కూడా కలిపి అనుమతులు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మినీబస్సులు, హైదరాబాద్​లో సెట్విన్ సర్వీసుల సేవలతో పాటు మెట్రోరైల్​కు షటిల్ సర్వీసులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ

File : TG_Hyd_04_01_Govt_on_RTC_Pkg_3053262 From : Raghu Vardhan ( ) ఆర్టీసీలో కొన్ని మార్గాల ప్రైవేటీకరణకు రంగం సిద్ధమవుతోంది. రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిర్ణయించిన విధంగా మూడు వేలకు పైగా మార్గాల్లో ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కేవలం ఆదాయాన్నిచ్చే మార్గాలే కాకుండా గ్రామీణ, సిటీ మార్గాలను కలిపి అనుమతులు ఇవ్వవచ్చని సమాచారం...లుక్ వాయిస్ ఓవర్ - ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు కొత్త రూపు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. సమ్మె ప్రారంభ సమయంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మార్పులు, చేర్పులకు రంగం సిద్ధమవుతోంది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి... సగం బస్సులు యాజమాన్యానివే ఉంటాయని తెలిపారు. మిగతా సగం బస్సులు అద్దె వాటితో పాటు ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లు ఉంటాయని చెప్పారు. 30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లు ఉండాలన్నది సర్కార్ ఆలోచన. అందుకు అనుగుణంగా ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ నేతృత్వంలోని కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వాటి ఆధారంగానే ఇప్పటికే అదనపు అద్దె బస్సుల కోసం ఆర్టీసీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రెండు దఫాల్లో 1250 అద్దె బస్సులకు నోటీసు ఇచ్చారు. ఇందుకు స్పందన కూడా బాగానే వచ్చింది. హైదరాబాద్ లోని కొన్ని మార్గాల్లో మాత్రం స్పందన అంతగా లేదు. ఆర్టీసీలో ఇప్పటికే 21 శాతం అద్దె బస్సులు ఉన్న నేపథ్యంలో మిగతా తొమ్మిది శాతం అద్దె బస్సులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 3400 వరకు చేరనుంది. అటు సంస్థ సొంత బస్సులు 5200 నడవనున్నాయి. ఆర్టీసీ సొంత బస్సులతో పాటు అద్దె బస్సులు కలిపి 80 శాతం పోను మిగతా 20శాతం ప్రైవేట్ బస్సులకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతి ఇవ్వాలనది ప్రభుత్వ ఆలోచన. అంటే 2100 ప్రైవేట్ బస్సులకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతుల విషయమై రేపటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ఆధారంగా ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతులు ఇవ్వవచ్చని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే రేపటి కేబినెట్ లో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుమతులు ఎవరు ఇవ్వాలి, ఏయే మార్గాల్లో ఇవ్వాలి, విధివిధానాలు ఎలా ఉండాలన్న విషయమై అధికారులు కసరత్తు చేశారు. వాటి ఆధారంగా రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేవలం ఆదాయం వచ్చే మార్గాలను మాత్రమే ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అప్పగించకుండా... గ్రామీణ ప్రాంతాల మార్గాలతో పాటు హైదరాబాద్ సిటిలోని మార్గాలను కూడా కలిపి అనుమతులు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మినీబస్సులు, హైదరాబాద్ లో సెట్విన్ సర్వీసుల సేవలతో పాటు మెట్రోరైల్ కు షటిల్ సర్వీసులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Last Updated : Nov 1, 2019, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.