మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. పలుచోట్ల పార్టీ బలాబలాల గురించి సమాచారం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఒక మంత్రితో మాట్లాడుతూ, స్థానికంగా అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారని తెలిసింది. వరంగల్ జిల్లాలోని మంత్రిని స్థానిక పురపాలక సంఘంలో ప్రజాస్పందన గురించి అడిగారు.
ఎన్నికలు ముగిసే వరకు నియోజకవర్గంలోనే...
నల్గొండ జిల్లాలోని ఒక ఎమ్మెల్యేకు సీఎం ఫోన్ చేయగా ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు చెప్పారు. వెంటనే ఆయనను నియోజకవర్గానికి వెళ్లాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలతోనూ సీఎం మాట్లాడారు. వారివారి నియోజకవర్గాల్లో ఎన్నికల పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం...
తమ తమ నియోజకవర్గాల్లోని పురపాలక సంఘాల పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించినట్లు సీఎంకు ఇద్దరు మంత్రులు తెలిపారు. విపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు చెందిన కొందరు నేతలతోనూ సీఎం సంభాషించారు. పార్టీ నేతలు ఐక్యంగా పనిచేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇవీ చూడండి: ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి'