త్వరలో రాష్ట్రంలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘం ఏర్పాటు కానుంది. లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించేలా ఇటీవల చట్టసవరణ చేశారు. ఉపలోకాయుక్తగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తిని నియమించనున్నారు.
ఎంపిక కమిటీ - సభ్యులు
- లోకాయుక్త ఎంపిక కమిటీ - సీఎంతో పాటు మండలి ఛైర్మన్, శాసనసభాపతి, ఉభయసభల ప్రతిపక్షనేతలు సభ్యులుగా ఉన్నారు.
- మానవనహక్కుల సంఘం ఎంపిక కమిటీ - సీఎం, మండలి ఛైర్మన్, శాసనసభాపతి, ఉభయసభల ప్రతిపక్షనేతలతో పాటు హోంమంత్రి కూడా సభ్యులుగా ఉన్నారు.
- రాష్ట్రంలో అటు శాసనసభ, ఇటు శాసనమండలిలో ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి లేదు. దీంతో రెండు సభల్లోనూ ప్రతిపక్షనేతలు లేరు.
డెహ్రాడూన్ పర్యాటన రద్దు
మానవహక్కుల సంఘంలో ఇద్దరు సభ్యులను నియమించే అవకాశం ఉంది. ఒకరు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కాగా.. మరొకరు ఇతరులు ఉంటారు. ఇద్దరు సభ్యుల్లో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని ఛైర్మన్గా ఎంపిక చేసే అవకాశం ఉంది. రేపు డెహ్రాడూన్లో అఖిల భారత చట్టసభల సభాపతులు, కార్యదర్శుల సదస్సు ప్రారంభం కానుంది. మండలి ఛైర్మన్, శాసనసభాపతి ఈ సదస్సులో పాల్గొనాల్సి ఉంది. అయితే లోకాయుక్త, మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీల సమావేశం నేపథ్యంలో పర్యటన రద్దైనట్లు సమాచారం.