ETV Bharat / city

త్వరలో "తెలంగాణ బచావో".. కాంగ్రెస్‌ ర్యాలీ

"తెలంగాణ బచావో" పేరుతో కాంగ్రెస్‌ పార్టీ త్వరలో రాష్ట్రంలో భారీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. భారత్ బచావో ర్యాలీ స్ఫూర్తితో రాష్ట్రంలోనూ అదే తరహా ర్యాలీకి పథకం రూపొందించాలని హస్తం నేతలు భావిస్తున్నారు. దిల్లీలో ర్యాలీ ముగిసిన తర్వాత పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ కుంతియా నేతృత్వంలో జరిగిన ముఖ్యనేతల భేటీలో సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు.

soon-telangana-bachao-congress-rally
త్వరలో "తెలంగాణ బచావో".. కాంగ్రెస్‌ ర్యాలీ
author img

By

Published : Dec 15, 2019, 4:58 AM IST

దిల్లీ రాంలీలా మైదానం వేదికగా కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన.. భారత్‌ బచావో ర్యాలీ విజయవంతం కావడంతో అదే తరహాలో రాష్ట్రంలో జరపాలని.. రాష్ట్ర కాంగ్రెస్‌ భావిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఒకేరీతిలో ఉన్నందున పోరాటానికి సిద్ధం కావాలని నేతలు నిర్ణయించారు. కేసీఆర్​ చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడండి "కేసీఆర్‌ హాత్‌ సే తెలంగాణ బచావో" పేరుతో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించారు.

త్వరలో "తెలంగాణ బచావో".. కాంగ్రెస్‌ ర్యాలీ

పల్లెపల్లెన నిరసనలు, ధర్నాలు
దిల్లీలో భారత్‌ బచావో ర్యాలీ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా నేతృత్వంలో సమావేశమైన నేతలు ఈ మేరకు సమాలోచనలు చేశారు. గ్రామ గ్రామాన కార్యక్రమాలు నిర్వహించేందుకు పథక రచన చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. తెరాస సర్కారు విధానాలు పల్లెపల్లెన ఎండగట్టేలా కార్యచరణకు సిద్ధం కావాలని భేటీలో నిర్ణయించారు.

మున్సిపల్‌ ఎన్నికల గెలుపే లక్ష్యం
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితులను అందిపుచ్చుకోవాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఇందుకు త్వరలో రాబోయే మున్సిపల్‌ ఎన్నికలను వేదికగా మార్చుకొని కేసీఆర్​ నియంతృత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. పార్టీని వీడి తిరిగిసొంతగూటికి వచ్చే నేతల సేవలను ఉపయోగించుకునేలా చూడాలని పలువురు అభిప్రాయపడినట్లు సమాచారం.

"త్వరలో మరోసారి కోర్‌ కమిటి సమావేశమై తెలంగాణ బచావో కార్యక్రమం, మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పథక రచన చేయాలని హస్తం నేతలు నిర్ణయించినట్లు సమాచారం"

ఇవీ చూడండి: 'ఉరిశిక్షలు, ఎన్​కౌంటర్లు తాత్కాలిక ఉపశమనాలే...'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.