'విద్యార్థులంతా ఒకటే అని చాటిచెప్పేందుకు సాధారణంగా పాఠశాలలు, కళాశాలల్లో డ్రెస్ కోడ్ అమలు చేస్తారు.. కానీ బేగంపేట్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో మోకాళ్ల కింద వరకు ఉన్న కుర్తీల మాత్రమే ధరించాలన్న నిబంధన చాలా మూర్ఖంగా ఉంది. ఆ నిబంధనలు విద్యార్థినుల చదువు కంటే... వారెలా కనిపించాలన్న దానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు ఉన్నాయి. ఆడపిల్లల సాధికారతకు తోడ్పడాల్సిన విద్యాసంస్థలు వారి ఆహార్యంపై ఇంత దురుసుగా ప్రవర్తించడం మనం ఏ కాలంలో ఉన్నామో ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి. తమ హక్కు కోసం పోరాడి అనుకున్నది సాధించిన అమ్మాయిలకు నా సెల్యూట్...'
- చిన్మయి శ్రీపాద , గాయని
-
Looks like the girls at St Francis college rocked it :) pic.twitter.com/aQ4V1ePJvf
— Chinmayi Sripaada (@Chinmayi) September 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Looks like the girls at St Francis college rocked it :) pic.twitter.com/aQ4V1ePJvf
— Chinmayi Sripaada (@Chinmayi) September 16, 2019Looks like the girls at St Francis college rocked it :) pic.twitter.com/aQ4V1ePJvf
— Chinmayi Sripaada (@Chinmayi) September 16, 2019
- — Chinmayi Sripaada (@Chinmayi) September 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
— Chinmayi Sripaada (@Chinmayi) September 15, 2019
">— Chinmayi Sripaada (@Chinmayi) September 15, 2019
'హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల విద్యార్థినుల డ్రెస్‌కోడ్ వివాదం గురించి తెలిసి ఆవేదనకు గురయ్యాను. మహిళల కళాశాలలో పురుష అధ్యాపకులకు ఇబ్బందిగా ఉంటోందని విద్యార్థినులకు డ్రెస్‌కోడ్ నిబంధన పెట్టడం ఎంత వరకు సమంజసం. ఇక్కడ తప్పెవరిది? ఆ విద్యార్థినులను వేరే దృష్టితో చూస్తున్న పురుష అధ్యాపకులదా? నాకర్థం కావడం లేదు. అయినా... దుస్తులతో విద్యకు సంబంధం ఏంటి? వారు ఎలాంటి దుస్తులు ధరించాలన్నది వారిష్టం. పాఠశాలలు, కళాశాలల్లో నియమనిబంధనలు ఉండటం అనేది సాధారణ విషయమే కానీ... మహిళా సిబ్బందిని పెట్టి మరి విద్యార్థినులను లోపలికి రానీయకుండా వారిని తోసేస్తూ, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం. కళాశాల ప్రిన్సిపాలే విద్యార్థినుల మీద హిట్లర్‌లా ప్రవర్తిస్తూ వారితో దురుసుగా ప్రవర్తిస్తే వారింకెవరితో చెప్పుకుంటారు. వారు వేసుకున్న దుస్తులను చూస్తే నాకేం తప్పనిపించలేదు. నిండుగా ఉన్న దుస్తులు వేసుకున్నా... మోకాళ్ల కిందవరకు కుర్తీలేదని వారిని ఇబ్బంది పెట్టడం చాలా దారుణం. ఇది కేవలం సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల విద్యార్థినుల డ్రెస్‌కోడ్ విషయమే కాదు భావిభారత ఆడపిల్లల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. వారి పోరాటానికి మనమంతా కలిసి మద్దతివ్వాలి.'
- జెనీలియా, సినీనటి
- https://www.instagram.com/p/B2cPIr1ABZg/?igshid=vsqqibhg8eou
డ్రెస్‌కోడ్‌తో తమకు ఇబ్బంది లేదని, వారి దురుసు ప్రవర్తన, తమ తల్లిదండ్రులను అవమానించారనే.. ఆందోళనకు దిగామని విద్యార్థులు తెలిపారు. కళాశాల యాజమాన్యంతో తరగతి ప్రతినిధులు మాట్లాడగా.... డ్రెస్ కోడ్ నిబంధన ఎత్తివేస్తామని మాటిచ్చారన్నారు. కానీ... మినీ స్కర్ట్స్, క్రాప్ టాప్స్ ధరించి వస్తే మాత్రం లోపలికి అనుమతించమని స్పష్టం చేశారని వెల్లడించారు.
ఆడపిల్లల ఆత్మగౌరవం మీదకు వస్తే ఎంత వరకైనా వెళ్తామని నిరూపించారు సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల విద్యార్థినులు.