ETV Bharat / city

తెరాసకు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మద్దతు - singareni employees about trs

మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకే ఓటేస్తామని సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ప్రకటించారు. సొంత ఖర్చులతో ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్​తో సమావేశమై... మద్దతుపై లేఖను అందజేశారు.

singareni employees support to trs
singareni employees support to trs
author img

By

Published : Jan 19, 2020, 8:26 PM IST

తెరాసకు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. సొంత ఖర్చులతో విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్​తో ఆయన నివాసంలో ఉద్యోగులు భేటీ అయ్యారు.

మద్దతుపై లిఖిత పూర్వకంగా వినోద్‌కు లేఖను అందజేశారు. సింగరేణి ఉద్యోగులను వినోద్ కుమార్‌ అభినందించారు. నాలుగు ఉమ్మడి జిల్లాలోని 9 మున్సిపాలిటీల పరిధిలో దాదాపు లక్ష మంది ఓటర్లుగా సింగరేణి ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు.

వినోద్ కుమార్​తో సమావేశమైన వారిలో ఆ సంఘం కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోళ్ల రమేశ్, ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బాణోత్ కర్ణ, నాయకులు మల్లేష్, వెంకటేశ్వర్లు, రాజేశ్వరరావు, పద్మారావు, రమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.

తెరాసకు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మద్దతు

ఇదీ చూడండి: భాజపా మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

TG_Hyd_72_19_Singareni_Employees_Support_TRS_AV_3053262 Reporter: Raghuvardhan Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) టీఆర్‌ఎసో్‌కు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించుకుంటామని ఉద్యోగులు స్పష్టం చేశారు. తమ తమ సొంత ఖర్చులతో విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తో అయన నివాసంలో ఉద్యోగులు భేటీ అయ్యారు. తమ మద్దతుపై లిఖిత పూర్వకంగా వినోద్‌కు మద్దతు లేఖను అందజేశారు. సింగరేణి ఉద్యోగులను వినోద్ కుమార్‌ అభినందించారు. ఉమ్మడి నాలుగు జిల్లాలోని 9మున్సిపాలిటీల పరిధిలో దాదాపు లక్ష మంది ఓటర్లుగా సింగరేణి ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి నాలుగు జిల్లాల్లోని బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని, భూపాలపల్లి, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలో సింగరేణి ఎస్సీ, ఎస్టీ 16 వేల మంది ఉద్యోగులు, కుటుంబ సభ్యుల ఓట్లు కలిపి దాదాపుగా ఒక లక్ష వరకు ఉంటాయని, ఈ ఓట్లన్నీ టీఆర్ఎస్ అభ్యర్థులకే వేస్తారని ఆ సంఘం నాయకులు తెలిపారు. వినోద్ కుమార్ తో సమావేశమైన వారిలో ఆ సంఘం కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోళ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బాణోత్ కర్ణ, నాయకులు మల్లేష్, వెంకటేశ్వర్లు, రాజేశ్వరరావు, పద్మారావు, రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.