ETV Bharat / city

"ఉత్తమ్​పై.. అధిష్ఠానానికి సీనియర్ల ఫిర్యాదు"

హస్తంలో ముసలం మళ్లీ మొదలైంది. పార్టీ కార్యకలాపాల్లో తమపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ముగ్గురు సీనియర్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియాను కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీలో కేవలం ఒక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ఆరోపించారు.

author img

By

Published : Jan 5, 2020, 7:43 PM IST

Updated : Jan 5, 2020, 8:15 PM IST

seniors-complaint-to-uttam-supremacy
"ఉత్తమ్​పై.. అధిష్ఠానానికి సీనియర్ల ఫిర్యాదు"

తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముగ్గురు సీనియర్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియాను కలిసి ఫిర్యాదు చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య , మాజీ ఎంపీ వి.హనుమంతురావు, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహులు... గోల్కొండ హోటల్‌లో దాదాపు రెండున్నర గంటలపాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యవహారంపై చర్చించారు.

సొంత నిర్ణయాలేంటి: సీనియర్లు

తమ జిల్లాల్లో తమకు సంబంధం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని సీనియర్లు కుంతియాకు వివరించారు. తమను కావాలనే పార్టీలో పదేపదే అవమానాలకు గురి చేస్తున్నారని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఒక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చేట్లు నిర్ణయాలు ఉన్నాయని, బీసీలు, ఎస్సీలు పార్టీకి దూరమవుతున్నారని వివరించారు.

"రాష్ట్ర కాంగ్రెస్‌ను తక్షణం ప్రక్షాళన చేయాలని.. పార్టీలో 40శాతం మంది కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. వారిని పక్కన పెట్టకపోతే కాంగ్రెస్‌కు అధికారం రావడం కలగానే మిగిలిపోతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ చెప్పినట్లు సమాచారం"

ఫిర్యాదులోని అంశాలు

  1. ఉత్తమ్‌ ఏకపక్ష నిర్ణయాలతో.. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది.
  2. అధికార పార్టీ, భాజపా బీసీలకు పెద్ద పీఠ వేస్తుంటే సొంత పార్టీలో బీసీలను అనగదొక్కుతున్నారు.
  3. మున్సిపల్ ఎన్నికల సమన్వయ కమిటీల నియామకంలో తీవ్ర అవమానానికి గురి చేశారు.
  4. పార్టీలో సీనియర్ నాయకులకు గుర్తింపు ఇవ్వటం లేదు.
  5. సీనియర్లను కార్పొరేషన్ స్థాయికి పరిమితం చేయడం సరికాదు.

ఇవీ చూడండి: మున్సి'పోల్స్': పురపాలక రిజర్వేషన్లు ఇవే...

Intro:Body:Conclusion:
Last Updated : Jan 5, 2020, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.