హైదరాబాద్ నల్లగండ్ల జీఎన్టీ కూడలి వద్ద రోడ్డు విస్తరణ కోసం చెట్లను నరికేస్తున్న వారిని పౌరులు అడ్డుకుని నిరసన తెలిపారు. రోడ్డు విస్తరణ కోసం చెట్లు నరకడం సరైంది కాదని నినదించారు. పౌరులు, పిల్లలు చేస్తున్న నిరసనకు టీవీ యాంకర్ ఝాన్సీ మద్దతు పలికారు. రోడ్డు విస్తరణకు చెట్లను నరకటం సరికాదన్నారు. రోడ్లు విస్తరణను ఇక్కడి స్థానికులు కోరారా?.. బిల్డర్లు కోరారా? అంటూ మైకులో నిలదీసారు.
వంద చెట్లను నరికేందుకు ఇక్కడ ప్రయత్నిస్తుండగా.. ఇప్పటికే 50 చెట్లు నేలకొరగటంతో పౌరులు అడ్డుకున్నారు. చిన్నారులు చెట్లకు రాఖీలు కట్టి వాటితో ఉన్న అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.