ETV Bharat / city

"కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరం.. అంతిమ విజయం మాదే.."

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని ఆర్టీసీ ఐకాస  కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఎవరెన్ని బెదిరింపులకు దిగినా.. అంతిమవిజయం కార్మికులదేనని చెప్పారు. టీఎంయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమై ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై చర్చించారు.

rtc jac press meet in hyderabad
author img

By

Published : Oct 25, 2019, 12:43 PM IST

Updated : Oct 25, 2019, 4:40 PM IST

హైదరాబాద్​లోని టీఎంయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమై కేసీఆర్​ వ్యాఖ్యలపై చర్చించారు. సీఎం నిన్న మాట్లాడిన తీరు సరిగా లేదని... ముఖ్యమంత్రి మాటలతో ఒక ఆర్టీసీ కార్మికుడు ఒత్తిడికి లోనయి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ పరిరక్షణ కోసమే సమ్మె చేస్తున్నామని.. కార్మికులే స్వచ్ఛందంగా చేస్తున్న సమ్మె ఇదని అశ్వత్థామరెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రంలో నెరవేర్చిన డిమాండ్లను చులకన చేయడం సరికాదన్నారు. ప్రైవేటు బస్సులను గ్రామీణప్రాంతాల్లో కూడా తిప్పాలని పేర్కొన్నారు. సమ్మెను రాజకీయ కోణంలో కాకుండా.. కార్మికుల కోణంలో చూడాలని విన్నవించారు. కరీంనగర్‌లో చెప్పిన మాటలకు సీఎం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాన్ని కేసీఆర్ ఒకసారి చదివి అవగాహన చేసుకోవాలని హితవు పలికారు.

ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డిపై డ్రైవర్​ ఫిర్యాదు

Gorakhpur (Uttar Pradesh), Oct 25 (ANI): A head constable has shot dead his son in Uttar Pradesh's Gorakhpur on October 24. The incident took place at the Chauri-Chaura police station in Gorakhpur. While speaking to ANI, Deputy Superintendent of Police (DSP) of Gorakhpur Sumit Shukla said, "He had an altercation with his son during which a shot was fired and his son died on the spot." "Perpetrator was apprehended and his licensed weapon has been seized," DSP added.
Last Updated : Oct 25, 2019, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.