రేపటి సడక్ బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు అందిన తర్వాత సమ్మె కొనసాగింపుపై రేపు సాయంత్రం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి ఉస్మానియా ఆస్పత్రిలో దీక్ష విరమించారు. అఖిల పక్షం నేతల ఒత్తిడి మేరకు ఐకాస నాయకులు దీక్ష విరమించారు.
ఇదీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'