ETV Bharat / city

పంటకు ధర కరవు... ఆవేదనలో కందిరైతు

author img

By

Published : Jan 20, 2020, 4:19 AM IST

Updated : Jan 20, 2020, 6:58 AM IST

కంది రైతుకు ఉచ్చు బిగుస్తోంది. మార్కెట్‌లో కందిపప్పు ధర వంద రూపాయలకు పైనే ఉన్నా రైతుల కొత్త పంటకు గిట్టుబాటు ధర గగనంగా మారింది. ఖరీఫ్‌ పంట మార్కెట్‌కు వస్తున్న తరుణంలో వ్యాపారులు ధరలు బాగా తగ్గించేస్తున్నారు. వ్యాపారుల మాయాజాలంతో మద్దతు ధర దక్కడం లేదని కంది రైతులు వాపోతున్నారు.

Reduced_Red_Grains_Price
పంటకు ధర కరవు... ఆవేదనలో కందిరైతు

కంది పంటను రాష్ట్రంలో ఈ సీజన్‌లో 7 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు ఆరు క్వింటాళ్ల చొప్పున 43 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 25 శాతం కింద పది లక్షల క్వింటాళ్ల పంటను కొనాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం రాష్ట్ర లెక్కలను పక్కన పెట్టి అర్ధగణాంక శాఖ ముందస్తు దిగుబడుల అంచనాల నివేదికను పరిగణలోకి తీసుకుని కేవలం నాలుగు లక్షల 95 వేల క్వింటాళ్లు కొనేందుకు అనుమతిచ్చింది.

అమాంతం ధరలు తగ్గిస్తున్న వ్యాపారులు

ఈ మేరకు నాఫెడ్‌ తరఫున రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్యకు క్షేత్రస్థాయిలో కొనుగోలు బాధ్యతలు అప్పగించింది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. కేంద్రం కొనేది సుమారు 5 లక్షల క్వింటాళ్లే అని తేలగా.... కొండెక్కిన వ్యాపారులు ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు.

మద్దతు ధర ఇవ్వడం లేదు

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మద్దతు ధరకు కొన్న రెండున్నర లక్షల క్వింటాళ్ల కందులు మార్క్‌ఫెడ్‌ వద్ద ఇంకా నిల్వ ఉన్నాయి. కొత్త పంట రాకముందే వీటిని అమ్మేయాలి. ఇటీవల టెండర్లు పిలిస్తే మార్కెట్‌లో కంది పప్పుకు గిరాకీ లేదని వ్యాపారులు ముందుకు రాలేదు. ధర తగ్గించి కొనుగోలుకు నిబంధనలను మార్చాలని మార్క్‌ఫెడ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ లేఖ రాసింది. ఇక రేపోమాపో అనుమతి వస్తే వీటిని తక్కువ ధరకు అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తు‌న్నారు. ఇవి మార్కెట్‌లోకి వస్తే కొత్త పంటకు మరింత ధర తగ్గించాలనే వ్యూహంతో వ్యాపారులున్నారు. ఇప్పటికే కొత్త పంటకు వారు మద్దతు ధర ఇవ్వడంలేదు. క్వింటాల్‌ మద్దతు ధర 5వేల 800 కాగా... వెయ్యి రూపాయలు తగ్గించి మరీ కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

19-01-2020 TG_HYD_05_19_REDUCED_RED_GRAINS_PRICE_PKG_3038200 REPORTER : MALLIK.B Note : file vis and grfx ( ) కంది రైతుకు ఉచ్చు బిగుస్తోంది. మార్కెట్‌లో కందిపప్పు ధర 100రూపాయలకు పైనే ఉన్నా కూడా రైతుల కొత్త పంట కందులకు మాత్రం ధర కరవవుతోంది. మార్క్‌ఫెడ్ వద్ద ఉన్న 2.50 లక్షల క్వింటాళ్ల పాత కందులు ధరలు తగ్గించి ఇవ్వాలని వ్యాపారులు బేరం ఆడుతున్నారు. అవి ధరలు తగ్గించి ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న టెండర్ల నిబంధనలు మార్చేందుకు యత్నాలు సాగుతున్నాయి. అవి బయటకి వస్తే కొత్త పంట ధరలు మరింత తగ్గినున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. LOOK........... VOICE OVER - 1 ఏదైనా దుకాణానికెళ్లి కందిపప్పు కిలో ఎంత అని అడగండి. 100 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువే చెబుతున్నారు. కానీ, రైతులు పండించిన కొత్త కందులుగానీ... ప్రభుత్వం వద్ద పేరుకుపోయిన 2.50 లక్షల క్వింటాళ్ల పాత కందులను కొనే నాథుడే లేరు. గత జూన్ నుంచి సాగు చేసిన ఖరీఫ్‌ పంట కందులు మార్కెట్‌కు వస్తున్న తరుణంలో ధరలు బాగా తగ్గించి వ్యాపారులు ఉచ్చు బిగిస్తున్నారు. పంట అమ్ముకోవాలంటే రైతులకు నష్టాలు తప్పడంలేదు. రాష్ట్రంలో పండిన పంట దిగుబడుల్లో 4వ వంతు మాత్రమే కొంటామని కేంద్ర వ్యవసాయశాఖ తాజా రాష్ట్రానికి ఆదేశాలిచ్చింది. ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలో 7.20 లక్షల ఎకరాల్లో కంది పంట రైతులు సాగు చేశారు. ఎకరానికి 2.70 క్వింటాళ్ల చొప్పున మొత్తం 19.80 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని... మద్దతు ధరకు కొనాలని కేంద్రానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే... నిబంధనల ప్రకారం మొత్తం పంటలో 25 శాతం అంటే 4.75 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనడానికి కేంద్రం అనుమతించింది. జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య - నాఫెడ్‌ను కొనమని ఆదేశాలు ఇచ్చింది. నాఫెడ్ తరపున తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య - మార్క్‌ఫెడ్‌కు క్షేత్రస్థాయిలో కొనుగోలు బాధ్యతలు అప్పగిస్తూ నోడల్ ఏజెన్సీగా నియమించారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. గతేడాది కూడా ఇలాగే మద్దతు ధరకు కొన్న 2.50 లక్షల క్వింటాళ్ల కందులు మార్క్‌ఫెడ్ వద్ద ఇంకా నిల్వలున్నాయి. వీటిని వాస్తవానికి కొత్త పంట మార్కెట్‌కు రాకముందే అమ్మేయాలి. కానీ, ఇటీవల టెండర్లు పిలిస్తే మార్కెట్‌లో కందిపప్పుకు డిమాండ్ లేదని వ్యాపారులు ముందుకు రాలేదు. ధర తగ్గించి కొనుగోలు నిబంధనలు మార్చాలని మార్క్‌ఫెడ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. మళ్లీ ఈ మేరకు మార్క్‌ఫెడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి అడుగుతూ లేఖ రాసింది. ఒక రేపోమాపో అనుమతి వస్తే వీటిని తక్కువ ధరకు అమ్మేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇవి మార్కెట్‌లోకి వస్తే కొత్త పంటకు మరింత ధర తగ్గించేయాలనే వ్యుహంతో వ్యాపారులున్నారు. ఇప్పటికే కొత్త పంటకు వారు మద్దతు ధర ఇవ్వడంలేదు. క్వింటాల్‌ మద్దతు ధర 5800 రూపాయలు కాగా అంతకన్నా వెయ్యి నుంచి 2 వేల రూపాయల దాకా తగ్గించి కొంటున్నారని రైతులు వాపోతున్నారు. కేంద్రం అనుమతించిన 4.75 లక్షల క్వింటాళ్ల కొనుగోలుకు 122 కొనుగోలు కేంద్రాలు తెరవాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. ఇప్పటికీ 22680 క్వింటాళ్లను కొన్నది. వారికింకా సొమ్ము నాఫెడ్ ఇవ్వలేదని చెల్లించలేదు. VOICE OVER - 2 రాష్ట్రంలో కంది పంట విషయంలో ప్రభుత్వం చెప్పేదానికి వాస్తవాలకు పొంతన కుదరడంలేదు. ఈ ఏడాది ఎకరానికి 6 క్వింటాళ్ల చొప్పున మొత్తం 43.20 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో 25 శాతం కింద 10.80 లక్షల క్వింటాళ్లు కొనాలని కేంద్రాన్ని సర్కారు కోరింది. కానీ, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు పక్కన పెట్టి అర్థ, గణాంక శాఖ - డీఈఎస్‌ ముందస్తు దిగుబడుల అంచనాల నివేదికను పరిగణలోకి తీసుకుంది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో 19.80 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇందులో 25 శాతం కొనడానికి కేంద్రం అనుమతించింది. వ్యవసాయ శాఖ చెప్పిన దిగుబడి అంచనాలో కనీసం సగానికి సగం కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. కేంద్రం కొంటానికి ఇంత వరకూ అనుమతి గానీ, నిధులు గానీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇంతా తేడా ఎందుకు (GRFX) అంశం వ్యవసాయశాఖ లెక్క కేంద్రం లెక్క రాష్ట్రం మొత్తం కంది సాగు విస్తీర్ణం ( ఎకరాలు ) 7,20,000 7,36,000 మొత్తం దిగుబడి అంచనా ( టన్నులు ) 43,20,675 19,89,120 కేంద్రం కొనాల్సింది ( 25శాతం ప్రకారం ) 10,80,160 4,75,000 ఎకరానికి సగటు దిగుబడి ( క్వింటాళ్లు ) 6 2.74
Last Updated : Jan 20, 2020, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.