కోర్టు ధిక్కరణ కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కమలాసన్ రెడ్డి సహా ముగ్గురు పోలీసు అధికారులకు గతంలో సింగిల్ జడ్జి విధించిన జైలుశిక్ష నిలిపివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి... తీగలగుట్టపల్లిలో పుష్పాంజలి రిసార్టులోకి ప్రవేశించారని మాజీ ఎమ్మెల్యే జగపతిరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో.. గతంలో హైకోర్టు సింగిల్‌జడ్జి శిక్షవిధించారు.
సీపీ కమలాసన్ రెడ్డి, కరీంనగర్ అప్పటి ఏసీపీ తిరుపతి, కరీంనగర్ గ్రామీణ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ శశిధర్‌రెడ్డిలకు 6 నెలల జైలుశిక్ష, 12వేల జరిమానా విధించారు.. అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును నాలుగు వారాలు నిలిపివేస్తూ న్యాయమూర్తి గతంలో ఆదేశాలు జారీ చేశారు. సింగిల్‌జడ్జి తీర్పు సవాల్ చేస్తూ ఆ ముగ్గురు హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. అప్పీళ్లను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించింది.
ఇవీచూడండి: 'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'