ETV Bharat / city

బూటకపు వాగ్దానాలు నమ్మొద్దు.. తెరాసకు షాక్ ఇద్దాం : ఉత్తమ్ - uttam kumar latest speech

మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్​ ఉత్తమ్‌ ఖండించారు. తెరాస నాయకులు పోలీసుల సాయంతో... నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్నారని ఆరోపించారు. మరికొన్ని చోట్ల నామినేషన్లు ఉపసంహరింపజేశారని విమర్శించారు.

uttam kumar
uttam kumar
author img

By

Published : Jan 17, 2020, 7:19 PM IST

కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేకపోయిందని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 'కాపీకాట్' రాజకీయాలు చేస్తోంది తెరాసనేనని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలను తారుమారు చేశారని, న్యాయమైన పద్ధతిలో ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని ఆయన దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వానికి సాయం చేయడానికి సీఏఏ, ఎన్ఆర్సీలపై మంత్రులు గందరగోళం సృష్టిస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు.

అలా లబ్ధి పొందారు

మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లేకపోవటానికి కారణం తప్పుడు ఎన్నికల పద్ధతులేనని ఉత్తమ్ మండిపడ్డారు. ఎన్నికల ప్రకటన తేదీకి నామినేషన్ ప్రక్రియకు మధ్య వ్యవధి లేకపోవడం వల్లనే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయని పేర్కొన్నారు. వార్డు రిజర్వేషన్లను తెరాస ముందుగానే తెలుసుకుని రాజకీయ లబ్ధి పొందిందని ఆరోపించారు. నోటిషికేషన్‌, నామినేషన్‌ ప్రక్రియకు మధ్య వ్యవధి కావాలని మాత్రమే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

షాక్ ఇద్దాం

తెరాస నాయకులు పోలీసుల సాయంతో... నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్నారని ఆరోపించారు. కొన్ని చోట్ల పోలీసుల సమక్షంలోనే కొట్టి.. నామినేషన్లను ఉపసంహరింపచేశారని విమర్శించారు. బ్యాక్ డోర్ పద్ధతుల ద్వారా విజయాన్ని సాధించడానికి తెరాస ప్రయత్నిస్తున్నప్పటికీ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెరాస బూటకపు వాగ్దానాలను విశ్వసించొద్దని ప్రజలకు పిలుపునిచ్చిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి... కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అధికార పార్టీకి పెద్ద షాక్ ఇవ్వాలని కోరారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది...

TG_Hyd_45_17_UTTAM_ON_TRS_AV_3038066 From : Tirupal reddy Dry ()కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాల్లో అభ్యర్ధులను కూడా నిలబెట్టుకోలేకపోయిందని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. 'కాపీకాట్' రాజకీయాల్లో పాల్గొంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి నేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలను తారుమారు చేశారని, న్యాయమైన పద్ధతిలో ఎన్నికలు జరిగితే తెరాసకు ఒక్క సీటు కూడా గెలవలేదని ఆయన దుయ్యబట్టారు. తెరాస మంత్రులు బీజేపీ ప్రభుత్వానికి సహాయం చేయడానికి సిఎఎ, ఎన్ఆర్సిలపై గందరగోళం సృష్టిస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లేకపోవటానికి కారణం తప్పుడు ఎన్నికల పద్ధతులేనని ఆయన ద్వజమెత్తారు. ఎన్నికల ప్రకటన తేదీకి నామినేషన్ ప్రక్రియకు మధ్య వ్యవధి లేకపోవడం వల్లనే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయని ఆరోపించారు. వార్డ్ రిజర్వేషన్లను తెరాస ముందుగానే తెలుసుకుని, రాజకీయ లబ్ది పొందిందని, నోటిషికేషన్‌కు, నామినేషన్‌ ప్రక్రియకు మధ్య వ్యవధి కావాలని మాత్రమే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు దాదాపు 500 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్‌ ఖండించారు. "తెరాస నాయకులు, స్థానిక పోలీసుల సహాయంతో, నామినేషన్ పత్రాలు దాఖలు చేయకుండా కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్నారనఇ, కొన్ని చోట్ల పోలీసుల సమక్షంలోనే కొట్టి, వేసిన నామినేషన్లను సైతం కూడా ఉపసంహరింపచేశారని ఆరోపించారు. బ్యాక్ డోర్ పద్ధతుల ద్వారా విజయాన్ని సాధించడానికి తెరాస ప్రయత్నిస్తున్నప్పటికీ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. తెరాస బూటకపు వాగ్దానాలను విశ్వసించొద్దని ప్రజలకు పిలుపునిచ్చిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అధికార పార్టీకి పెద్ద షాక్ ఇవ్వాలని కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.