ETV Bharat / city

ఎన్​హెచ్​ఆర్సీ ఎదుట దిశ తండ్రి, సోదరి... అరగంటపాటు విచారణ

ఎన్‌హెచ్‌ఆర్‌సీ పిలుపు: పోలీస్ అకాడమీకి 'దిశ' తండ్రి, సోదరి

author img

By

Published : Dec 8, 2019, 3:54 PM IST

Updated : Dec 8, 2019, 7:01 PM IST

15:44 December 08

.

దిశ తండ్రి, సోదరితో ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ

హైదరాబాద్ పోలీస్​ అకాడమీలో దిశ తండ్రి, సోదరితో  ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ ముగిసింది. నిందితుల ఎన్‌కౌంటర్‌పై దిశ తండ్రి, సోదరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అరగంట పాటు పలు విదాలుగా ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు, ఆ తర్వాతి పరిణామాలపై ఆరా తీశారు.

అంతకుముందు
చటాన్‌పల్లి వద్ద హత్యాచారానికి గురైన ‘దిశ’ తల్లిదండ్రులకు జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నుంచి పిలుపొచ్చింది. వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారిని కోరింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను రాష్ట్ర పోలీస్‌ అకాడమీకి తీసుకెళ్లేందుకు పోలీసులు శంషాబాద్‌లోని ఇంటికి వెళ్లారు. దిశ దశదిన కర్మ రోజున విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని తొలుత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమె తల్లి ఆరోగ్యం సహకరించడం లేదని.. ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరారు.

తండ్రితోపాటు సోదరి హాజరు
ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీరుకు నిరసనగా దిశ నివాసం వద్ద కాలనీవాసులు ఆందోళకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొంతసేపటికి పోలీసులు ఒప్పించడంతో దిశ దిశ తండ్రితోపాటు సోదరి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రత్యేక వాహనంలో విచారణకు బయల్దేరారు. 

Intro:Body:Conclusion:
Last Updated : Dec 8, 2019, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.