నోటి ద్వారా అనేక రకాల జబ్బులు వస్తాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నోరు పరిశుభ్రంగా ఉంటుకుంటే... వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చన్నారు. కోఠి డీఎంహెచ్‌వో కార్యాలయంలో డెంటల్ కౌన్సిల్ ప్రారంభానికి... ఈటల రాజేందర్‌తో కలిసి హాజరయ్యారు. అనేక న్యాయ సమస్యలను ఎదుర్కొని... రాష్ట్రం ఏర్పాటైన ఆరేళ్ల తర్వాత డెంటల్ కౌన్సిల్ ఏర్పటైనట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 15వేల మంది దంత వైద్యులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.
ఇదీ చూడండి: ఎయిమ్స్‌ను మరింతగా తీర్చిదిద్దుతాం: కిషన్ రెడ్డి