తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ.. ఐదేళ్లుగా ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా విధానాలు రూపొందించామని తెలిపారు. దిల్లీలో క్రిసిల్స్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సుకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను సమీకరించడంలో రాష్ట్రం అనుసరించిన విధానాలను ప్రస్తావించారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ , ఇంక్లుజన్ వంటి ముఖ్యమైన మూడు అంశాలపై తమ ప్రభుత్వం దృష్టిసారించిందని పేర్కొన్నారు.
మేమే ఫస్ట్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004-14 మధ్య కాలంలో తెలంగాణలో రూ.54వేల 52 కోట్లు మూలధన వ్యయంపై ఖర్చు చేశారు. గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మూలధన వ్యయంపై చేసిన ఖర్చును రూ. లక్షా 64వేల 519 రూపాయలుగా కేటీఆర్ వెల్లడించారు. పీఆర్‌ఎస్ అధ్యయనం ప్రకారం ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగ్రామిగా నిలిచామని తెలిపారు. మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో మూలధన సృష్టి కోసమే 63 శాతం వ్యయం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవీచూడండి: టీ హబ్లో ఎన్పీసీఐ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రారంభం