దిల్లీలోని ఎన్డీఎంసీ భవనంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షత 38వ జీఎస్టీ సమావేశం ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల అర్థిక మంత్రులు, అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.
రాష్ట్రాల సాధికారతను పెంచేలా కేటాయింపులు జరపాలని సమావేశంలో మంత్రి హరీశ్ రావు కేంద్రానికి సూచించారు. జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వాని తెలిపారు. పన్ను చెల్లింపుదారుల కోసం ఆమ్నెస్టీ పథకం తీసుకురావాలని.. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు రూ.450 కోట్లు విడుదల చేయాలన్నారు.
రాష్ట్ర పథకాలకు నిధులు కేటాయించాలి...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలైన మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయలకు నిధులను కేటాయించాలని సమావేశంలో మంత్రి హరీశ్‌రావు సూచించారు. నీతిఅయోగ్ ప్రతిపాదనల మేరకు నిధులు కేటాయించాలన్నారు. మూడేళ్ల కాల వ్యవధికి మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని హరీశ్‌రావు తెలిపారు.
ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్ అనుచరుల వీరంగం