ETV Bharat / city

పురపీఠాధీశులు ఎన్నికయ్యేది నేడే... - పురపీఠాధీశులు ఎన్నికయ్యేది నేడే...

పురపీఠాధీశులెవరన్నది నేటితో తేలిపోనుంది. తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థల్లో పరోక్ష పద్ధతిలో మేయర్​, డిప్యూటీ మేయర్, ఛైర్​పర్సన్, వైస్​ ఛైర్​పర్సన్​​ల ఎన్నిక జరగనుంది.

పురపీఠాధీశులు ఎన్నికయ్యేది నేడే...
పురపీఠాధీశులు ఎన్నికయ్యేది నేడే...
author img

By

Published : Jan 27, 2020, 4:22 AM IST

Updated : Jan 27, 2020, 8:59 AM IST

పురపీఠాధీశులు ఎన్నికయ్యేది నేడే...

పురపాలక ఎన్నికలలో ఆఖరి ఘట్టం నేటితో పూర్తికానుంది. 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థలకు మేయర్లు, ఛైర్‌పర్సన్‌లను ఇవాళ ఎన్నుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​కు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ఎన్నిక నోటీసు కూడా జారీ చేశారు. ఇందుకోసం పాలకమండళ్లు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.

పురపాలక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే మధ్యాహ్నం 12.30కు మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. పోటీలో ఒకరే ఉంటే ఎన్నిక ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఆయా పురపాలికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేతులెత్తే విధానంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరికీ సమానమైన ఓట్లు వస్తే లాటరీ విధానంలో విజేతను ఎంపిక చేస్తారు. కనీసం సగం మంది సభ్యుల హాజరుతో కోరం ఉంటేనే మేయర్, ఛైర్ పర్సన్‌ల ఎన్నిక నిర్వహిస్తారు.

ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఏ పార్టీ సభ్యుడైనా విప్ ధిక్కరిస్తే తన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక పూర్తయ్యాక డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఒకవేళ ఇవాళ ఎన్నికలు జరగకపోతే ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు పాలక మండళ్లను తిరిగి రేపు సమావేశపరుస్తారు.

ఇవీ చూడండి: రాజ్​భవన్​​లో ఎట్​హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు

TG_Hyd_04_27_Election_Pkg_3053262 From : Raghu Vardhan ( ) పురపీఠాధీశులెవరన్నది నేటితో తేలిపోనుంది. తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థల్లో పరోక్ష ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు చేతులెత్తే పద్ధతిన మేయర్లు, చైర్ పర్సన్లను ఎన్నుకోనున్నారు...లుక్ వాయిస్ ఓవర్ - పురపాలక ఎన్నికలలో ఆఖరి ఘట్టం నేటితో పూర్తికానుంది. 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థలకు సంబంధించిన పరోక్ష ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఆయా నగరాలు, పట్టణాలకు మేయర్లు, చైర్ పర్సన్ లను ఎన్నుకోన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ఎన్నిక నోటీసు కూడా జారీ చేశారు. మేయర్లు, చైర్ పర్సన్ ల ఎన్నిక కోసం పాలకమండళ్లు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఇటీవలి పురపాలక ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే మేయర్, చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలా 30 నిమిషాలకు మేయర్, చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. పోటీలో ఒకరే ఉంటే ఎన్నిక ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న చోట పదవుల కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల తో పాటు ఆయా పురపాలికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేతులెత్తే విధానంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరికీ సమానమైన ఓట్లు వచ్చిన సందర్భంలో లాటరీ విధానంలో విజేతను ఎంపిక చేస్తారు. కనీసం సగం మంది సభ్యుల హాజరుతో కోరం ఉంటేనే మేయర్, చైర్ పర్సన్ ల ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఏ పార్టీ సభ్యుడైనా విప్ ధిక్కరిస్తే తన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. మేయర్, చైర్ పర్సన్ ఎన్నిక పూర్తయ్యాక డిప్యూటీ మేయర్, వైస్ చైర్ పర్సన్ ఎన్ని కూడా నిర్వహిస్తారు. ఏదేని కారణాల వల్ల మేయర్, చైర్ పర్సన్ ఎన్నిక పూర్తి కాకపోతే డిప్యూటీల ఎన్నికను చేపట్టరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఇవాళ ఎన్నికలు జరగకపోతే ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు పాలక మండళ్లను తిరిగి రేపు సమావేశపరుస్తారు.
Last Updated : Jan 27, 2020, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.