ETV Bharat / city

ఉవ్వెత్తున ఎగిసిన మంటలు... విద్యుదాఘాతమే కారణం! - current shock may reason for fire accident

వనస్థలిపురం ఇందిరానగర్‌లోని టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేశారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ఉవ్వెత్తున ఎగిసిన మంటలు... విద్యుదాఘాతమే కారణం!
author img

By

Published : Oct 28, 2019, 5:57 AM IST

హైదరాబాద్‌ శివారులోని వనస్థలిపురం ఇందిరానగర్‌లో ఉన్న టైర్ల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. గమనించిన కాదమంచి అపార్ట్‌మెంటువాసులు సమాచారం ఇవ్వగా... అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఎంతకీ అదుపులోకి రాకపోవటం వల్ల... జేసీబీలతో గోదాంను కూల్చి మంటలు ఆర్పారు. జనావాసాల మధ్యనున్న గోదాంను తొలగించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు.

మంటల దాటికి కాదమంచి అపార్ట్‌మెంటు అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు వెంటనే అపార్ట్‌మెంటువాసుల్ని ఖాళీ చేయించారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటితో కలిసి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. గోదాం యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జనావాసాల మధ్య ఇలాంటి ప్రమాధకరమైన గోదాంలు ఏర్పాటు చేయకుండా జీహెచ్‌ఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఉవ్వెత్తున ఎగిసిన మంటలు... విద్యుదాఘాతమే కారణం!

ఇదీ చూడండి: విషాదం: అంబులెన్స్​ కింద పడి యువకుడు మృతి...

TG_HYD_06_28_FIRE_ACCIDENT_OVERALL_PKG_3066407 REPORTER:K.SRINIVAS ( )హైదరాబాద్‌ శివారులోని టైర్ల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టైర్లు నిల్వ చేసే గోదాంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో... మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ వాసులు భయంతో ఉరుకులు పరుగులు తీశారు. ఏడు అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక, విపత్తు నిర్వాహణ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. మంటలు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో అధికారులు గోదాంను జేసీబీలతో కూల్చివేసి మంటలను ఆర్పాల్సి వచ్చింది. జనావాసాల మధ్య గోదాంను తొలగించమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.....LOOOK V.O:టైర్ల గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంతో అటు అధికారులను ఇటు స్థానికులు ఆందోళన చెందారు. వనస్థలిపురం ప్రాంతంలోని ఇందిరానగర్‌లో టైర్లు నిల్వ చేసే గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం అయిదు గంటల సమయంలో గోదాం నుంచి పొగలు రావడం గమనించిన పక్కనే ఉన్న కామంచి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌ వాసులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి... అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పే పనిలో పడ్డారు. ఎంతకీ మంటలు అదుపులోకి రాకపోయేసరికి వారికి తోడుగా జీహెచ్‌ఎంసి విపత్తు నిర్వాహణ సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి గోదాం వద్దకు చేరుకొని దగ్గర ఉండి సిబ్బంది చేపడుతున్న సహాయ చర్యలను పర్యవేక్షించారు. సుమారు 11 గంటలు గడిచినా మంటలు అదుపులోకి రాకపోవడంతోఒక వైపు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పుతూనే మరో వైపు జేసీబీల సహాయంతో గోదాంను కూల్చివేశారు. బైట్‌:ప్రత్యక్ష సాక్షి, కాదమంచి అపార్ట్‌మెంట్‌ వాసి బైట్‌:కిరణ్‌, స్థానికుడు బైట్‌:శ్రీధర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బైట్‌:బొంతు రామ్మోహన్‌, మేయర్‌ V.O:ఒక దశలో టైర్ల గోదాం పక్కను ఉన్న కాదమంచి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌కు కూడా వ్యాపిస్తాయా అనే స్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. మంటల ధాటికి అపార్ట్‌మెంట్‌ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు అపార్ట్‌మెంట్‌ వాసులందరినీ తక్షణమే ఖాళీ చేయించారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. సుమారు 11 గంటల పాటు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌ ఘాతం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గోదాం యజమానిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. E.V.O:జనావాసాల మధ్య ఈ తరహా గోదాంలు ఏర్పాటు చేయకుండా జీహెచ్‌ఎంసి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.