హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకొంది. రామారావునగర్‌లోని ఇంట్లో అన్నపూర్ణ (పూర్ణిమ) అనే వివాహిత నిన్న సాయంత్రం అనుమానాస్పద రీతిలో మృతిచెందింది.
మెడ, తలపై గాయాలు..
టెక్ మహీంద్రాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న అన్నపూర్ణ గత నెల 22న.. దాసరి కార్తిక్ అనే స్థిరాస్తి వ్యాపారిని ప్రేమ వివాహం చేసుకొంది. మహిళ తల్లిదండ్రులు అంగీకరించకపోవడం వల్ల వారిని ఎదిరించి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం సాయంత్రం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పేర్కొన్నారు. మృతురాలి మెడ, తలపై గాయాలున్నాయని.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. మృతురాలి భర్త కార్తిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటన ప్రాంతంలో సూసైడ్ నోట్ లభించిందని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
భర్తపైనే అనుమానం..
మద్యం మత్తులో భర్తే హత్య చేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఇవీచూడండి: దత్తత తల్లిదండ్రుల వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య