ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇరవైఏళ్ల తరువాత మరొకరిని ప్రేమించింది. విడాకుల కోసం కట్టుకున్నవాడిని, పిల్లలను కాదని కోర్టుకెక్కింది. కోర్టులో విడాకులు లభించకముందే మరో పెళ్లి చేసుకుంది. ఈ ఉదంతంపై ఆమె మొదటి భర్త సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు సూచన మేరకు ఆమెపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని శ్రీకృష్ణానగర్ ప్రాంతానికి చెందిన అశోక్(42), ఒక యువతి 1999 మేలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 18 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. 2016లో ఖమ్మం జిల్లాకు చెందిన వేణుగోపాల్‌తో ఆమె మరోసారి ప్రేమలో పడింది. ఈ అంశంపై భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ వ్యవహారం కొలిక్కి రాకుండానే 2017లో ఖమ్మంలో వేణుగోపాల్‌ను ఆమె వివాహం చేసుకొందని, వారిరువురు భార్యాభర్తలమని చూపి ఇంటి రుణం సైతం తీసుకున్నారంటూ కోర్టును అశోక్ ఆశ్రయించగా.. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని బంజారాహిల్స్ పోలీసులకు కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి... ప్రేమ కోసం.. తల్లిని చంపి తండ్రిపైనే ఫిర్యాదు