టిక్‌టాక్ పరిచయంతో ప్రేమలో పడిన ఇద్దరు యువతులు... యువకులను కలిసేందుకు గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం దర్గా హోన్నూరుకు వెళ్లారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి చెందిన ఇద్దరు యువతులకు... ఆరు నెలల కిందట దర్గాహోన్నూరుకు చెందిన వంశీ, వన్నూరు స్వామి అనే యువకులతో టిక్‌టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లి వరకు వచ్చింది. వారి మాటలు నమ్మి యువతులు ఆంధ్రాకు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరారు.
తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత యవకులు మాట మార్చి... పెళ్లికి నిరాకరించారు. గ్రామస్థులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత యువతులను కళ్యాణదుర్గం ఉజ్వల హోమ్‌కు తరలించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అప్పగిస్తామని ఎస్ఐ రమణారెడ్డి అన్నారు.
ఇదీ చదవండి