కూకట్‌పల్లిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతిచెందాడు.
వసంత నగర్లో ఉంటున్న ఖాసీం.. నారాయణ కాలేజీలో పనిచేస్తున్నాడు. ఇవాళ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. చైతన్య కళాశాలకు చెందిన నీటి ట్యాంకర్ బలంగా ఢీ కొంది. సుమారు 20 అడుగుల వరకు మృతదేహాన్ని ఈడ్చుకుపోయింది. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవీచూడండి: టైర్ పంక్చరై అదుపు తప్పిన బస్సు.. ఇద్దరికి అస్వస్థత