ETV Bharat / city

తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు

చూస్తే పెద్ద మనుషుల్లా ఉన్నరు.. దారికి అడ్డంగా ఉంటే ఎలా? అని అడిగినందుకు ఓ యువకుడిపై మూకుమ్మడి దాడి చేశారు బుడ్డ లీడర్లు. కూకట్​పల్లి మైత్రీనగర్​లో ఈ సంఘటన జరిగింది. అడ్డొచ్చిన మరో మహిళ పైనా ప్రతాపం చూపించారు. ఈ గూండాలపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు మాత్రం లైట్ తీసుకున్నరు. వీళ్ల వెనక పెద్ద లీడరన్న ఉన్నడట మరి.

author img

By

Published : Nov 13, 2019, 8:17 PM IST

Updated : Nov 13, 2019, 11:08 PM IST

తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు

దారికి అడ్డంగా ఊరికే ఉండటమే బుద్ధి తక్కువ వ్యవహారం. అలాంటిది వేళ కాని వేళ.. చీకటి పడ్డాక సొల్లు కబుర్లు చెప్పుకుంటూ... మందు తాగి తందనాలు ఆడేందుకు నడి రోడ్డేమన్నా ఆడి తాత జాగీరా? కాదు కదా..! కానీ ఇక్కడ ఇది మా తాత జాగీరే అంటున్నారు ఓ ఏరియా బుడ్డ లీడర్లు.

దారివ్వండి.. ఇతరులను ఇబ్బంది పెట్టకండి అంటూ ప్రశ్నించిన ఓ యువకుణ్ని చావ బాదారు. ఒక్కడు కాదు. ఇద్దరు కాదు. గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఒంటరి యువకునిపై శూరత్వం ప్రదర్శించారు. పిడిగుద్దులు కురిపించారు. బూటుకాళ్లతో తన్నారు. తీవ్ర గాయాలపాలైన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డుపై తాగి తందనాలు ఆడకండి. బుద్ధిగా ఉండండి అంటే ఇంత అరాచకమా? అని అడుగుతున్నాడా బాధిత బ్యాంకు ఉద్యోగి.

రోడ్డుకు అడ్డంగా బైకులు పెట్టి మద్యం సేవిస్తున్న సదరు గల్లీ లీడర్లు.. కాదు కాదు.. సిల్లీ లీడర్లు.. కేవలం దారికి అడ్డంగా ఉండొద్దన్నందుకు ఈ యువకుడిని చావబాదారు. లీడర్లంతా ఓ పెద్ద లీడరన్నకు అనుచరులట. అందుకే పోలీసులు కూడా కేసు గీసు జాన్తా నై.. అంటున్నరట. కాంప్రమైజ్, కాంప్రమైజ్ అని కేసు నాన్చుతున్నరట.

మంగళవారం రాత్రి కూకట్​పల్లి మైత్రీనగర్​లో ఈ దారుణం చోటుచేసుకుంది. రాజేష్​ అనే ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా... ఈ ఘటన జరిగింది. అడ్డొచ్చిన వాచ్​మెన్​ భార్యను కూడా మహిళ అనే కనికరం లేకుండా కొట్టారు ఆ గూండాలు. ఫిర్యాదు చేసినా... ఇంత వరకు పోలీసులు స్పందించలేదని బాధితుడు చెప్తున్నారు.

ఇప్పుడు సీసీటీవీ వీడియో ఫుటేజి లభించింది. దీంతో ఫిర్యాదు తీసుకున్న స్థానిక పోలీసులు... కేసు వద్దంటూ నేరుగా రంగంలోకి దిగి సెటిల్​మెంటుకు ప్రయత్నిస్తున్నారట! దాడిలో ఆ యువకుడి ప్రాణాలు పోయుంటే వీళ్లే తిరిగి తీసుకొచ్చి బతికిద్దురు గావొచ్చు. మరి పెద్ద సార్లూ... మీరన్న కేసు బందోబస్తుగ పెట్టించి గూండాలతోని ఊసలు లెక్కబెట్టిస్తరా.. లేకుంటే మీరు కూడా పెట్టి కేసుకు జైకొట్టి కాంప్రమైజ్.. కాంప్రమైజ్ అంటరా? ఐపీఎస్​ చదివినోళ్లు.. మీకే తెలవాలె సారూ!

ఇదీ చూడండి: ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం- సుప్రీం సంచలన తీర్పు

Intro:TG_ADB_13_31_SCIENCE DRAMA_AV_C6

Body:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా సైన్స్ కేంద్రంలో జిల్లాస్థాయి సైన్సు డ్రామా అండ్ రోల్ ప్లే పోటీలను నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమానికి పాల్గొనగా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ స్నేహలత ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని మూఢనమ్మకాల ను సమాజం నుంచి పారదోలాలని అసిస్టెంట్ కలెక్టర్ స్నేహలత విద్యార్థులకు సూచించారు. జిల్లా సైన్స్ కేంద్రంలో డ్రామా పోటీలకు విద్యార్థులు హరితహారం వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక బాధ్యత ప్రశ్నించే తత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా సైన్స్ అధికారి మధు బాబు తెలిపారు. నీటి సంరక్షణ, మొక్కల సంరక్షణ, మూఢనమ్మకాల నిర్మూలన పై చేసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైన్సు డ్రామాలు అందరినీ ఆలోచింపజేశాయి.
బైట్:మధు బాబు , జిల్లా సైన్స్ అధికారి మంచిర్యాల
ప్రత్యూష,( ముత్యం పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని,)
శాంకరి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు)
స్నేహలత ( అసిస్టెంట్ కలెక్టర్ మంచిర్యాల)

Conclusion:
Last Updated : Nov 13, 2019, 11:08 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.