ETV Bharat / city

మద్యం మరింత ప్రియం... సర్కారుకు భారీ ఆదాయం - liquer rates hike

తెలంగాణలో మందుబాబులకు మద్యం తాగకుండానే కిక్కు ఎక్కనుంది. మద్యం కొనుగోళ్లపై ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అదనంగా నాలుగు వేల కోట్లకుపైగా ప్రభుత్వ ఖజానాకు జమ కానుంది. బీరు, బ్రాందీలపై 10 నుంచి 80 రూపాయల వరకు, విదేశీ మద్యంపై 150 రూపాయలు పెరిగాయి. పెరిగిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.

liquer rates hike in telangana
మద్యం ధరల్లో పెరుగుదల
author img

By

Published : Dec 17, 2019, 5:23 AM IST

Updated : Dec 17, 2019, 7:51 AM IST

పురపాలక ఎన్నికల తరువాత తెలంగాణలో మద్యం ధరలు పెరుగుతాయని భావించారు. ఎన్నికలు ఆలస్యం కావటం వల్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరల పట్టికను ఆబ్కారీశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం నాడు విడుదల చేశారు. లిక్కర్‌ క్వార్టర్‌పై రూ.20లు, హాఫ్‌పై రూ.40లు, ఫుల్​ బాటిల్​పై రూ.80లు, స్ట్రాంగ్‌ బీరుపై రూ.10, లైట్‌ బీరుపై రూ.20లు, విదేశీ మద్యం సీసాపై రూ.150ల చొప్పున పెంచినట్లు వెల్లడించారు.

మద్యం ధరల పెరుగుదల... సర్కారు ఖజానాకు భారీ ఆదాయం

మద్యం అమ్మకాలు..

తెంలగాణలో 2018 జనవరి నుంచి డిసెంబర్ చివరినాటికి వరకు రూ.20వేల కోట్ల విలువైన 3 కోట్ల 33 లక్షల కేసుల లిక్కర్, 4 కోట్ల 85 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. 2019 జనవరి నుంచి డిసెంబర్ 15 వరకు 3 కోట్ల 37 లక్షల కేసుల లిక్కర్, 5 కోట్ల వెయ్యి కేసుల బీర్లు అమ్ముడుపోయి... 21 వేల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ నెలాఖరుకు ఇంకో 15 రోజులు ఉండటం వల్ల మరో వెయ్యి కోట్ల రూపాయల విక్రయాలు జరిగి... ఈ ఏడాది పూర్తయ్యే నాటికి 22 వేల కోట్ల వ్యాపారం జరగుతుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.

అదనపు ఆదాయం..

ఈ ఏడాది చివరినాటికి 3 కోట్ల 40 కేసుల లిక్కర్, 5 కోట్ల 10 వేల బీరు కేసులు అమ్ముడుపోతాయని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. అంటే 40 కోట్ల 80 లక్షల ఫుల్ బాటిళ్ల లిక్కర్, 61 కోట్ల 20 లక్షల బీరు బాటిళ్లు విక్రయిచే అవకాశం ఉంది. పెరిగిన ధరల ప్రకారం లిక్కర్‌పై 3 వేల 264 కోట్లు, బీర్ల అమ్మకాలపై 918 కోట్ల ఆదాయం వస్తుంది. సగటున 4వేల 182 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు అదనంగా చేరనున్నాయి. ప్రతి ఏడాది రెండు వేల కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్ముడుపోతున్నందున... ఇంతకంటే ఎక్కువ ఆదాయమే సర్కారుకు సమకూరనుందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రభుత్వం మద్యం పాలసీ ప్రకటించాలి: కోదండరాం

TG_HYD_02_17_LIQUOR_RATES_HIKE_HUGE_AMT_GAIN_FOR_GOVT_PKG_3038066 Reporter: ఎం.తిరుపాల్‌ రెడ్డి ()తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు మద్యం తాగకుండానే కొత్త ఏడాదిలో ధరల పెంపుతో ప్రభుత్వం కిక్కు ఎక్కించింది. మద్యం ధరల పెంపుతో నాలుగువేల కోట్లకుపైగా మొత్తం అదనంగా ప్రభుత్వ ఖజానాకు జమ కానుంది. బాటిల్‌పై రూ.10 నుంచి రూ.80 వరకు బీరు, బ్రాందీలపై ధరల పెరగ్గా...విదేశీ మద్యం సీసాపై రూ.150 ప్రకారం పెంచిన ప్రభుత్వం రేపటి నుంచి నూతన ధరలను అమలు చేయనుంది. LOOK వాయిస్ఓవర్‌1: తెలంగాణాలో పురపాలక ఎన్నికల తరువాత మద్యం ధరలు పెరుగుదల ఉంటుందని భావించినప్పటికీ...ఆ ఎన్నికలు ఆలస్యం కావడంతో ప్రభుత్వం ధరలు పెంచుతూ నిన్న సాయంత్రం ధరల పట్టికను విడుదల చేసింది. అబ్కారీ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ ధరల పట్టికను విడుదల చేశారు. లిక్కర్‌ 90 ఎంఎల్‌ సీసాపై రూ.20లు, 180 ఎంఎల్‌ సీసాపై రూ.40లు, 750ఎంఎల్‌ సీసాపై రూ.80లు లెక్కన పెంచగా, స్ట్రాంగ్‌ బీరుపై రూ.10, లైట్‌ బీరుపై రూ.20లు, విదేశీ మద్యం సీసాపై రూ.150లు లెక్కన ధరలు పెంచినట్లు సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాల పరంపర ఒకసారి పరిశీలించినట్లయితే...తెలంగాణ రాష్ట్రంలో 2018 జనవరి నుంచి డిసెంబరు వరకు రూ.20వేల కోట్లు విలువైన 3.33 కోట్లు కేసులు లిక్కర్‌, 4.85 కోట్లు కేసులు బీరు అమ్ముడు పోయింది. అదే 2019 జనవరి నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు దాదాపు 21వేల కోట్లు విలువైన 3.37 కోట్లు కేసులు లిక్కర్‌, 5.01 కోట్లు కేసులు బీరు అమ్ముడు పోయింది. ఈ నెలాఖరు వరకు మరో 15 రోజులు మిగిలి ఉండడంతో ఇంకో వెయ్యి కోట్లు విలువైన మద్యం విక్రాయలు జరుగుతాయని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే 2019 ఏడాదిలో 22వేల కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరగనున్నట్లు అంచనా వేస్తున్న అధికారులు ప్రతి ఏడాది రెండువేల కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన మద్యం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. వాయిస్ఓవర్‌2: లిక్కర్‌ కేసు అంటే...750ఎంఎల్ సామర్థ్యం కలిగిన 12 బాటిళ్లుకాగా అదే బీరు అయితే....650ఎంఎల్‌ సామర్థ్యం కలిగిన 12 బాటిళ్లు ఒక కేసుగా పరిగణిస్తారు. అబ్కారీ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం ఏడాదిలో 3.40 కోట్లు కేసులు లిక్కర్‌ అమ్ముడు పోతుందని అంచనా వేసుకుంటే...మొత్తం 40.80 కోట్లు లిక్కర్‌ బాటిళ్లు అమ్ముడు పోతున్నాయి. ఒక్కో బాటిల్‌పై పెరిగిన ధర రూ.80లను లెక్కిస్తే రూ.3,264 కోట్లు అదనపు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. అదే విధంగా ఏడాది 5.10 కోట్లు కేసులు బీరు అమ్ముడు పోతుందని అంచనా వేసుకుంటే.....61.20 కోట్లు బీరు బాటిళ్లు విక్రయాలు జరుగుతాయి. అయితే స్ట్రాంగ్‌ బీరుపై పది రూపాయలు, లైట్‌ బీరుపై రూ.20 లెక్కన ధర పెంచడంతో...సగటున ఒక్కో బాటిల్‌పై రూ.15లు పెరుగుతుందని అంచనా వేస్తే...మొత్తం 61.20 కోట్లు బీరు బాటిళ్లపై సగటున రూ.15లు పెరుగుతుందని లెక్క గట్టితే....రూ.918 కోట్లు మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే అటు లిక్కరు, ఇటు బీరులపై ప్రభుత్వం పెంచిన ధరలను వర్తింప చేస్తే ఏడాదిలో తక్కువలో తక్కువ అనుకున్నా రూ.4,182 కోట్లు అదనంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు. అయితే ప్రతి ఏడాది రెండు వేల కోట్లు విలువైన మద్యం అదనంగా అమ్ముడు పోతున్నందున...ఇంతకంటే ఎక్కువే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
Last Updated : Dec 17, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.