కాసేపట్లో సీఎం కేసీఆర్ వేములవాడకు బయలుదేరనున్నారు. ఇవాళ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. వేములవాడ, మధ్యమానేరు ప్రాంతాల్లో పర్యటించి పనుల పురోగతి సమీక్షించనున్నారు. మొదటగా వేములవాడ ఆలయంలో సీఎం పూజలు చేయనున్నారు. అనంతరం మధ్యమానేరును పరిశీలించనున్నారు. మధ్యమానేరు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇవీ చూడండి: మధ్య మానేరు ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్