ETV Bharat / city

హస్తిన పర్యటనలో కేసీఆర్, రేపు ప్రధానితో భేటీకి అవకాశం.. - కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన పలు రాష్ట్ర సమస్యలను కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు. ప్రధాని, కేంద్రమంత్రులతో సమావేశమై.. పెండింగ్ సమస్యలకు పరిష్కారం కోరనున్నారు.

హస్తినకు బయలుదేరిన కేసీఆర్
హస్తినకు బయలుదేరిన కేసీఆర్
author img

By

Published : Dec 2, 2019, 8:56 PM IST

Updated : Dec 2, 2019, 10:27 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి 7.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తిన బయలుదేరి వెళ్లారు. దిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై.... ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను...... కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. పెండింగ్ సమస్యలను మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని కోరనున్నారు.

ప్రధానితో భేటీ..

రాష్ట్రానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్​మెంట్-ఐఐఎం మంజూరుకు సంబందించిన అంశంపై ప్రధానితో చర్చించే అవకాశముంది. విభజన చట్టం పెండింగ్ అంశాలు, రహదార్ల విస్తరణ కోసం రక్షణశాఖ భూములు...., ఆర్థిక మాంద్యం దృష్ట్యా రాష్ట్రాలకు అదనపు నిధులు, కేంద్రం నుంచి రావల్సిన బకాయిలు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ తదితర అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్యలు నేర్పాలి: మంత్రి సబితా

Intro:Body:Conclusion:
Last Updated : Dec 2, 2019, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.