ETV Bharat / city

ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర

ఉద్యోగాల పేరుతో  నిరుద్యుగుల్ని మోసం చేసిన కేసులు ఎన్నో చూశాం... తాజాగా మరో మోసం వెలుగు చూసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బుల వసూలు చేస్తున్న  ఖైరతాబాద్‌లోని సంస్థపై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర
author img

By

Published : Oct 24, 2019, 5:34 AM IST

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ... ఖైరతాబాద్‌లోని జాబ్‌సైట్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగాల కోసం పలు వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నవారి చరవాణీ నంబర్లకు సందేశాలు పంపిస్తారు. అక్కడికి వెళితే... రిజిస్ట్రేషన్‌ కోసమని వెయ్యి, శిక్షణ కోసం మరో 1500 తీసుకుంటున్నట్లు వాపోయాడు. జాబ్‌ కోసం నిలదీస్తే... ఉద్యోగానికి పనికిరావు అన్నారని ఆరోపించాడు.

సైఫాబాద్‌ పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని... బాధితుడు ఈటీవీని ఆశ్రయించాడు. వివరాలు కనుక్కునేందుకు వెళ్లిన ఈటీవీ బృందాన్ని చూసి సంస్థ ఇంఛార్జి పరారయ్యాడు. ప్రతిరోజూ ఎంతో మంది నుంచి వసూలు చేస్తూ... లక్షల రూపాయలు దోచేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. సంస్థ బోర్డు కూడా లేదని ప్రశ్నించిన ఈటీవీ బృందానికి... తమ సంస్థ దిల్లీ నుంచి నడుస్తుందని, ఇక్కడ కంపనీ సిబ్బంది మాత్రమే ఉంటారని పొంతనలేని సమాధానం చెప్పారు. ఫిర్యాదు చేసినా పోలీసులు దీనిపై స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర

ఇదీ చూడండి: వచ్చే నెల మూడో వారంలో పురపోరు...!

TG_HYD_65_23_JOBS_FRAUD_PKG_3182400_3181326 note: డెస్క్ వాట్సప్ కి మరికొన్ని విజువల్స్ పంపాను ( )ఉద్యోగాల పేరుతో నిరుద్యుగుల్ని మోసం చేసిన కేసులు ఎన్నో చూశాం...తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఏమెజాన్, ఫ్లిప్ కార్ట్‌ లాంటి పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమాయకులైన నిరుద్యోగల నుంచి డబ్బుల వసూలు చేస్తున్న ఖైరతాబాద్ లోని జాబ్ ఎంటర్ ప్రైజెర్స్ సంస్థ పై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. look వాయిస్ ఉద్యోగాల కోసం పలు వెబ్ సైట్లలో వివరాలు నమోదు చేసుకున్న వారి ఫోన్ నంబర్లు తీసుకుని గవర్నమెంటు ఉద్యోగాలు అంటూ సందేశం పంపిస్తారు. ఇది చూసి వాళ్ళు ఇచ్చిన అడ్రెస్ కి వెళితే రిజిస్ట్రేషన్ కి వంద వెయ్యి రూపాయలు కట్టించుకున్నారని...దీని తర్వాత ట్రైనింగ్ కోసమని మరో 15 వందలు అడుతున్నారని ఆ యువకుడు వాపోయాడు. వెయ్యి రూపాయలు తిరిగి ఇస్తామన్నారిని..అడిగితే నువ్వు ఉద్యోగానికి పనికి రావు అని చెబుతున్నారని వివరించాడు. సైఫాబాద్ పోలీసుకు ఫిర్యాదు చేసినా చేసినా పట్టించుకోవట్లేదని అని ఆ యువకులు ఈటీవి కి తెలిపారు. దీంతో లోపలికి వెళ్ళిన ఈటీవి బృందాన్న చూసి సంస్థ ఇంచార్జ్ అమిత్ పరారయ్యాడు...రోజుకు 20 నుంచి 30 మంది నుంచి ఇలా వెయ్యి రూపాయలు తీసుకుని లక్షల రూపాయలు దోచేస్తున్నారని అక్కడ సంప్రదించిన నిరుద్యోగులు తెలిపారు. సంస్థ కు సంబంధించిన బోర్డు కూడా లేకపోవడంతో వారిని ప్రశ్నించిన ఈటీవీ ప్రతినిధులకు పొంతన లేని సమాధానాలు చేప్పారు. తమ సంస్థ ఢిల్లీ నుంచి నడుస్తుందని...ఇక్కడ కంపనీ ఉద్యోగులు మాత్రమే ఉంటారు అంటూ తెలిపారు. పిర్యాదు చేసినా దీనపై పోలీసులు మాత్రం స్పందించక పోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. బైట్: కిరణ్ బాధితుడు బైట్: తిరుపతి బాధితుడు బైట్ : బాధితుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.