మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ప్రశాంత్ 2017 ఏప్రిల్ 11న అదృశ్యమయ్యాడు. మాదాపూర్ పోలీసులు 29న కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేశారు. ఆచూకీ లభించకపోవడంతో కేసును మూసేశారు.
ఇద్దరు వ్యక్తులు ఇంటికొచ్చి...
ఏడెనిమిది నెలల కిందట ఇద్దరు వ్యక్తులు తమ ఇంటికొచ్చినట్లుగా ప్రశాంత్ అన్నయ్య శ్రీకాంత్ ‘ఈనాడు’కు చెప్పారు. వారే తర్వాత విశాఖలో ఉన్న తండ్రి బాబురావును కలిశారన్నారు. వారిలో ఒకరు ‘మీ కుమారుడు ఇప్పుడెక్కడున్నాడు? ఎప్పటి నుంచి కనిపించడంలేదు? ఏం చేసేవాడు? అని హిందీలో అడిగారని బాబురావు తెలిపారు. నెల తర్వాత ఇంకొకరు వచ్చి అవే ప్రశ్నలు అడిగారని, మీరెవరని అడిగితే బదులు ఇవ్వకుండానే వెళ్లిపోయాడని చెప్పారు. మాదాపూర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్తే దౌత్యకార్యాలయం నుంచి ఫోన్ వస్తుందంటూ చెప్పారన్నారు.
2014లో విశాఖపట్నం నుంచి!
ప్రశాంత్ తండ్రి బాబురావు ప్రైవేటు ఉద్యోగి. విశాఖపట్నంలో ప్రశాంత్ బీటెక్(కంప్యూటర్ సైన్స్) చేశాడు. 2014లో వీరి కుటుంబం హైదరాబాద్‌కు మారింది. ఇంజినీరింగ్ తర్వాత ప్రశాంత్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏడాదిన్నరపాటు పనిచేశాడు.
ఇదీ చదవండీ... "ప్రశాంత్ ప్రేమ విఫలమై డిప్రెషన్లో ఉన్నాడు"
ఆమెతో ప్రేమ...
అక్కడే మధ్యప్రదేశ్ కట్నీ ప్రాంతానికి చెందిన స్వప్నికాపాండే అనే యువతితో ప్రేమలో పడ్డాడని కుటుంబసభ్యులు చెప్పారు. తర్వాత మాదాపూర్‌లోని షోర్ ఇన్‌ఫోటెక్‌లో చేరినట్లుగా తెలిపారు. ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై మానసికంగా స్థిమితంగా లేడని చెబుతున్నారు. ఆమె కోసమే దారి తప్పి పాక్‌లోకి ప్రవేశించి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ రెండేళ్లు ఎక్కడున్నాడనేది మిస్టరీగా మారింది.
ఫోన్, పర్సు, ధ్రువపత్రాలు ఇంట్లోనే వదిలేసి...
హౌసింగ్‌బోర్డులోని ఓ ఎన్జీవోలో ప్రశాంత్ కొంతకాలం పనిచేసినట్లు తెలుస్తోంది. ఫోన్, పర్సు, ఇతర ధ్రువపత్రాలను ఇంట్లోనే వదిలేసి వెళ్లాడని కుటుంబసభ్యులు చెప్పారు. పాస్‌పోర్టు ఇక్కడున్నప్పుడే పోయిందన్నారు. ‘ఆ రోజు నుంచి ఆచూకీ లేదు. సోమవారం మీడియాలో చూసే గుర్తు పట్టాం. అక్రమంగా పాక్‌లోకి వెళ్లాల్సిన అవసరం ప్రశాంత్‌కు లేదు. ఎలాంటి గొడవలు, అక్రమ వ్యవహరాల్లో తలదూర్చేవాడు కాదు.
కేటీఆర్ సహాయం కోరాం...
దిల్లీలోని దౌత్యకార్యాలయానికి వెళ్లేందుకు యత్నిస్తున్నాం. క్షేమంగా విడిపించేందుకు కృషిచేయాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ను మంగళవారం కలిసి కోరాం. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. కేటీఆర్‌తో మాట్లాడించారు. ఆయన కేంద్రంతో మాట్లాడి సాయం చేస్తామని భరోసా ఇచ్చారు’ అని బాబురావు చెప్పారు. ‘
ప్రశాంత్‌ది కేవలం మిస్సింగ్‌కేసు మాత్రమే. పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయి. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. అసత్య ప్రచారాలను నమ్మొద్దు’ అని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్పష్టంచేశారు.
సంబంధిత కథనాలు...
బహావుల్‌పూర్‌లో తెలుగు యువకుడి నిర్బంధం