క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో రైల్ షాక్ ఇచ్చింది. ఉప్పల్ మైదానంలో మ్యాచ్లు జరిగే సమయాల్లో ప్రత్యేక ధరలు ప్రకటించింది. ఆయా రోజుల్లో ఉప్పల్ స్టేషన్ నుంచి ఎటు వెళ్లినా కనీసం టికెట్ రుసుము రూ.60గా నిర్ణయించింది.
ఉప్పల్ నుంచి పక్కనే ఉన్న స్టేషన్లో దిగినా ఇదే ధర వర్తిస్తుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇతర మెట్రోల్లో ప్రత్యేక రోజుల్లో కనీసం ధర రూ.100 ఉంటుందని.. హైదరాబాద్లో మాత్రం కనీస రుసుము రూ.60 మాత్రమేనని పేర్కొన్నారు. ఇండియా- వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక ఛార్జీలు అమలులోకి వచ్చాయన్నారు.
ఇవీచూడండి: అత్యధిక సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే పైకప్పు ప్రారంభం