ETV Bharat / city

ఎన్​ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లపై గళమెత్తిన ముస్లింలు - ఎన్​ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లపై గళమెత్తిన ముస్లింలు

ఎన్ఆర్​సీ, ఎన్​పీఆర్, సీఏఏలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్​లో ముస్లిం సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. మిలియన్ మార్చ్ పేరుతో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ఆందోళనకు పెద్దఎత్తున తరలివచ్చారు. వాటిని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లను అమలు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయాలన్నారు. పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినప్పటికీ... జనం పోటెత్తారు.

huge agitation on caa and nrc in hyderabad
ఎన్​ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లపై గళమెత్తిన ముస్లింలు
author img

By

Published : Jan 5, 2020, 5:15 AM IST

Updated : Jan 5, 2020, 8:06 AM IST

ఎన్​ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లపై గళమెత్తిన ముస్లింలు

ఎన్ఆర్​సీ, ఎన్​పీఆర్, సీఏఏలకు వ్యతిరేకంగా హైదరాబాద్​లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ దద్దరిల్లింది. మిలియన్ మార్చ్ పేరుతో నలభై సంఘాలతో కూడిన తహరీక్ ముస్లిం షబ్బాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు భారీగా నిరసనకారులు హాజరయ్యారు. నగరం నలుమూలల నుంచి ఎన్ఆర్​సీ, సీఏఏని వ్యతిరేకిస్తున్న వారు ఆందోళనలో పాల్గొన్నారు. ఈనెల 28న నిర్వహించాలనుకున్నప్పటికీ... పోలీసులు అంగీకరించక పోవడంతో... హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆందోళనకారులు ధర్నా చౌక్​కు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం లౌకిక వాద స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

నినాదాల హోరు..

ఎన్ఆర్​సీ, ఎన్​పీఆర్, సీఏఏలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్ ఆర్ సీ, ఎన్ పీఆర్ అమలు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని కోరారు. జాతీయ జెండాలు చేతపట్టుకొని పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్ఆర్​సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దద్దరిల్లిన ధర్నాచౌక్​ పరిసరాలు

సుమారు మూడు గంటల పాటు ఇందిరాపార్క్ ధర్నాచౌక్ పరిసరాలు నినాదాలతో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్ పాషా, ఎంబీటీ అధ్యక్షుడు అమ్జదుల్లా ఖాన్, తెజస ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు, టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజమాముద్దీన్ తదితరులు సభకు హాజరై సంఘీభావం ప్రకటించారు. భారీ ప్రదర్శన, సభతో ఇందిరాపార్కు, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించి పోయింది.

ఇవీ చూడండి: 'ఇప్పుడు వ్యతిరేకించకుంటే.. రేపు మరొకరికి ఇదే దుస్థితి రావొచ్చు'

TG_HYD_66_04_HUGE_AGITATION_CAA_NRC_PKG_TS10009 contributor: B.Ramakrishna ( ) ఎన్ఆర్ సీ, ఎన్ పీఆర్, సీఏఏలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ముస్లిం సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. మిలియన్ మార్చ్ పేరుతో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ఆందోళనకు పెద్దఎత్తున తరలివచ్చారు. కేంద్రం వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్ ఆర్ సీ, ఎన్ పీ ఆర్ అమలు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయాలన్నారు. పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినప్పటికీ... జనం పోటెత్తారు. look.. వాయిస్ ఓవర్: ఎన్ఆర్ సీ, ఎన్ పీఆర్, సీఏఏలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ దద్దరిల్లాయి. మిలియన్ మార్చ్ పేరుతో నలభై సంఘాలతో కూడిన తహరీక్ ముస్లిం షబ్బాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు భారీగా హాజరయ్యారు. నగరం నలుమూలల నుంచీ ఎన్ ఆర్ సీ, సీఏఏని వ్యతిరేకిస్తున్న వారు ఆందోళనలో పాల్గొన్నారు. ఈనెల 28నే నిర్వహించాలనుకున్నప్పటికీ... పోలీసులు అంగీకరించక పోవడంతో.... హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆందోళనకారులు ధర్నా చౌక్ కు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం లౌకిక వాద స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్ఆర్ సీ, ఎన్ పీఆర్, సీఏఏలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్ ఆర్ సీ, ఎన్ పీఆర్ అమలు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాతీయ జెండాలు చేతపట్టుకని పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్ ఆర్ సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బైట్లు (ఈటీవి భారత్ ఉర్దూ రిపోర్టర్ ఆలీ పంపించారు. కిట్ నంబరు 1089‌‌‌) వాయిస్ ఓవర్: సుమారు మూడు గంటల పాటు ఇందిరాపార్క్ ధర్నాచౌక్ పరిసరాలు నినాదాలతో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్ పాషా, ఎంబీటీ అధ్యక్షుడు అమ్జదుల్లా ఖాన్, టీజేఎస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు, టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజమాముద్దీన్ తదితరులు సభకు హాజరై సంఘీభావం ప్రకటించారు. భారీ ప్రదర్శన, సభతో ఇందిరాపార్కు, ట్యాంక్ బండ్ పరిసరాలు ఒక్కసారిగా పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించి పోయింది. end
Last Updated : Jan 5, 2020, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.