రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ ప్రజాస్వామ్య అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. హైదరాబాద్లోని తారామతి బారాదరిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల సంఘాన్ని, కమిషనర్ నాగిరెడ్డిని ఆమె ప్రశంసించారు. సాధారణ ఎన్నికల కన్నా స్థానిక ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువ నమోదవుతోందని గవర్నర్ అన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు చేపడుతున్న చర్యలను గవర్నర్ అభినందించారు.
పురపాలక ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎన్నికల విధానం గొప్పదని కితాబిచ్చారు. అనంతరం పురస్కార గ్రహీతలకు అవార్డులు అందజేశారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అత్యధిక పురస్కారాలు తమ శాఖ ఉద్యోగులకే దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..