కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజినీరింగ్ కృషి అద్భుతమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కితాబిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 34వ ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సాంకేతికత.. పేదల బతుకు మార్చేందుకు ఉపయోగపడాలని గవర్నర్ ఇంజినీర్లకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధతో ఇంజినీర్లు తమ ప్రతిభ, పనితీరుకు పదును పెట్టాలన్నారు. ఇంజినీరింగ్ విభాగం కృషి దేశాభివృద్ధికి దోహదపడాలని తమిళిసై తెలిపారు. పర్యావరణాన్ని పాడు చేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఎంతో ఉందని గవర్నర్ తెలిపారు. ఇంజినీర్లు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలని తమిళి సై సూచించారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్యేను కలిసేందుకు 90 కి.మీ పాదయాత్ర