ETV Bharat / city

మురికి వదలనుంది: మూసీ ప్రక్షాళనకు మూడు ప్రణాళికలు!

author img

By

Published : Dec 10, 2019, 9:53 AM IST

మురుగు మూసీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఇటీవల ఈనాడులో వచ్చిన కథనాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు... ప్రక్షాళన చేయాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదలింది. మూడు రకాల ప్రణాళికలతో మూసీ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పురపాలక మంత్రి కేటీఆర్‌ నిర్ణయించారు. వివిధ శాఖలు రెండు వారాల్లో ప్రాథమిక సమాచారాన్ని సేకరించి ప్రణాళికలను రూపొందించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మూసీలో మురుగు తొలగించాల్సిందే!
మూసీలో మురుగు తొలగించాల్సిందే!

మూసీ చాలా వరకు ఆక్రమణల్లోనే ఉంది. వీటి తొలగింపుపై యంత్రాంగమంతా దృష్టిసారిస్తే కానీ దీన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. మూసీలో రోజూ 1600 మిలియన్‌ లీటర్ల మురుగు కలుస్తుంటే... కేవలం 771 మిలియన్‌ లీటర్లే శుద్ధి చేస్తున్నారు. నదిలో పూడిక తీసి సుందరీకరణ చేసినా మురుగును నేరుగా ఇందులో వదిలేయడం వల్ల ఉపయోగం ఉండబోదని తేల్చారు. మూసీ దుస్థితిపై ఇటీవల ఈనాడులో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రస్తుత పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని సూచించింది.

అధికారులతో కేటీఆర్‌ చర్చలు..

హైకోర్టు సూచనల నేపథ్యంలో సోమవారం సంబంధిత శాఖల అధికారులతో గచ్చిబౌలిలో కేటీఆర్‌ సమీక్షించారు. వచ్చే రెండేళ్లలో తొలిదశ కింద నగర పరిధిలో మూసీ సుందరీకరణ చేయాలనేది రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్లు తెలిపారు. దీనికయ్యే వ్యయాన్ని బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని అనుకుంటున్నారు. 2021 చివరికల్లా హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ పాలకవర్గం ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటికి నదిలో కొంత భాగమైనా సుందరీకరణ చేయాలని భావిస్తున్నారు. మూసీలో మురుగు ఎకాఎకిన కలవకుండా నిరోధించేందుకు ఎన్ని మురుగునీటి శుద్ధి కేంద్రాలు అవసరమన్న దానిపై సమగ్ర నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని జలమండలి ఎండీ దానకిశోర్‌ను కేటీఆర్‌ ఆదేశించారు.

అధిక భాగం ఆక్రమణల్లోనే..

మూసీ పరిధిలో ఎన్ని వందల ఎకరాలు ఆక్రమణల్లో ఉంది.. అందులో ప్రభుత్వ భూమి ఎంత.. ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సత్వర నివేదికను ఇవ్వాలని రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ప్రాజెక్టు ప్రణాళికపై సమగ్ర నివేదిక అందజేయాలని మూసీ అభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. రెండు వారాల తరువాత మరోసారి సమావేశమై నది అభివృద్ధి ప్రణాళికకు తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రణాళిక రూపొందించాక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దాన్ని సమర్పించి ఆయన ఆదేశాలకు అనుగుణంగా టెండర్లకు వెళ్లాలని నిర్ణయించారు.

నిత్య నరకం..

చెత్తాచెదారం, కలుషిత జలాలతో మూసీ నది నగర ప్రజలకు నరకం చూపుతోంది. ఫలితంగా పరీవాహక ప్రాంతంలోని వేలాది కుటుంబాలు రకరకాల రోగాలతో సతమతమవుతున్నాయి. మూసీని స్వచ్ఛంగా మార్చడమే కాక పూర్తిస్థాయిలో సుందరీకణ చేస్తామని నాలుగేళ్ల కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సలహా సంస్థలు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై నివేదిక ఇచ్చినా నిధుల కొరతతో ముందుకెళ్లలేదు. హైదరాబాద్‌లోని 57.5 కిలోమీటర్ల పరిధిలో సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలంటే కనీసం రూ.2000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.

ఇదీ చూడండి: 'పాత కంప్యూటర్లతో తగ్గిపోతున్న ఉత్పాదకత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.