సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో ఓ ఉన్మాది ఇంటర్ విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. గొంతుకోసి భవనంపై నుంచి కిందకు పడేశాడు. వారసిగూడకు చెందిన నిందితుడు షోయబ్‌కు... ఇంటర్ విద్యార్థినికి బాల్య స్నేహితుడు. తొమ్మిదో తరగతివరకు కలిసే చదువుకున్నారు. విద్యార్థినిని పెళ్లి చేసుకునేందుకు షోయబ్ ప్రయత్నాలు చేయగా బాలిక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న షోయబ్ ఏ విధంగానైనా అంతం చేయాలని పథకం వేశాడు. గురువారం రాత్రి బాలికను ఇంటి డాబా పైకి పిలిచి కిరాతకంగా రాయితో గొంతుకోసి, దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను భవనం పైనుంచి తోసి వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు అనంతరం ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు. పోలీసుల విచారణలో హత్య విషయం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
మరింత సమాచారం: వారాసిగూడ హత్య: తనకు దక్కదనే కోపంలో..